Begin typing your search above and press return to search.

స్పై థ్రిల్ల‌ర్ లో ఆషీకా మెరుపులు!

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు ఓ కోలీవుడ్ హిట్ సినిమా సీక్వెల్ లో భాగ‌మైంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 7:33 AM GMT
స్పై  థ్రిల్ల‌ర్ లో ఆషీకా మెరుపులు!
X

2024 లో గ్రాండ్ స‌క్సెస్ తో ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ బ్యూటీ ఆషీకా రంగ‌నాధ్. అమ్మ‌డికి ఏడాది ఆరంభం లోనే 'నా సామి రంగ' రూపంలో మంచి క‌మ‌ర్శియ‌ల్ స‌క్సెస్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే 'అమిగోస్' తో బ్యూటీ ఫుల్ గాళ్ల్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న క‌న్న‌డ బ్యూటీకి రెండ‌వ సినిమా విజ‌యం మంచి బూస్టింగ్ లా క‌లిసొచ్చింది. దీంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకే ప్ర‌మోట్ అయింది.

ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర‌'లో ఛాన్స్ అందుకుంది. 'సామిరంగ' విజ‌యం చూసే చిరు కూడా అవ‌కాశం క‌ల్పించారు. చిరు-నాగ్ ల స్నేహం కూడా ఇక్క‌డ క‌న్న‌డ బ్యూటీకి క‌లిసొచ్చిన అంశం. ఇవిగాక శాండిల్ వుడ్ లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు ఓ కోలీవుడ్ హిట్ సినిమా సీక్వెల్ లో భాగ‌మైంది. కార్తీ స‌ర‌స‌న స‌ర్దార్ -2లో నాయిక‌గా ఎంపిక చేసారు.

ఇంత‌వ‌ర‌కూ అమ్మ‌డికి స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టించే ఛాన్స్ రాలేదు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లోనే న‌టిం చింది. తొలిసారి యాక్ష‌న్ స్కోప్ ఉన్న చిత్రంలో ఛాన్స్ రావ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌ధుల్లేవ్. న‌టిగా ఆమెలో కొత్త కొణాన్ని బ‌య‌ట‌కు తెచ్చే సినిమా అవుతుంద‌ని చెప్పొచ్చు. హీరోల స‌ర‌స‌న రొమాంటిక్ పాత్ర‌ల‌కు ప‌క్కా హీరోయిన్ అనే ఇమేజ్ ఆషీకా పై ఉంది. నేచుర‌ల్ పెర్పార్మ‌ర్ గానూ పేరుంది. కానీ యాక్ష‌న్ చిత్రాల‌కు ఈ రెండు ప‌నికిరావు.

తానో యూనిక్ న‌టిగా నిరూపించుకోవాలి. ఛాన్స్ క‌ళ్ల ముందుంది. మ‌రి ఎంత‌వ‌ర‌కూ ఉప‌యోగించు కుంటుందో చూడాలి. ఈ చిత్రానికి పి.ఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. `స‌ర్దార్` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో యావ‌రేజ్ గా ఆడినా.. ఈసినిమాకి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. త‌మిళ‌నాడు లో మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రంగా నిలిచింది. ఆ న‌మ్మ‌కంతోనే సీక్వెల్ ని తెర‌పైకి తెచ్చారు.