Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చూపులతో కవ్విస్తున్న వరాలు

అయితే కన్నడం లో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   26 July 2024 8:14 AM GMT
పిక్ టాక్‌ : చూపులతో కవ్విస్తున్న వరాలు
X

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. కన్నడంలో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేయడం ద్వారా సౌత్ ఇండియా మొత్తం లో స్టార్‌డం దక్కించుకుంది.


తెలుగు లో ఈ అమ్మడు నా సామి రంగ సినిమాలో నటించింది. నాగార్జున కు జోడీగా నటించిన ఈ అమ్మడు ఆకట్టుకుంది. అయితే సినిమా కమర్షియల్‌ గా నిరాశ పరచడంతో టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ అమ్మడిని పట్టించుకోలేదు. అయితే కన్నడం లో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతూనే ఉంది.


ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన అందమైన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌ అవుతున్నాయి.


బ్లూ జీన్స్ మరియు వైట్‌ టాప్ ధరించిన ఆషికా రంగనాథ్‌ కవ్వించే చూపులతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. కనిపించి కనిపించకుండా నడుము అందాన్ని చూపిస్తూ స్వీట్‌ అండ్‌ క్యూట్ అనిపించేంత అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంతటి అందగత్తె నా సామి రంగ సినిమాతో కాకుండా ఒక మంచి హిట్‌ సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టి ఉంటే కచ్చితంగా టాప్ స్టార్‌ గా ఎదిగి ఉండేది. నాగార్జున వంటి సీనియర్‌ హీరో తో సినిమా ను చేసిన ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో యంగ్‌ హీరోలు పెద్దగా కోరుకోవడం లేదని తెలుస్తోంది. ముందు ముందు అయినా ఈ అమ్మడు టాలీవుడ్‌ లో బిజీ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారు.