మెగా ఛాన్స్ అందుకున్న ముద్దుగుమ్మ..!
ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆషికకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 21 Feb 2024 5:02 AM GMTకన్నడ లో ఐదారు సినిమాలు చేసిన ఆషిక రంగనాథ్ తెలుగులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్ తో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం జరగ్గా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఆ టైం లో ఒకటి రెండు సినిమా అవకాశాలు వచ్చినా చేయని ఆషిక కింగ్ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడు చూపించిన అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నా సామిరంగ సక్సెస్ లో ఆషిక రంగనాథ్ కూడా ఒక రీజన్ అయ్యేలా ఆమె పర్ఫార్మెన్స్ మెప్పించింది.
నాగార్జున తో సూపర్ హిట్ అందుకున్న ఆషిక రంగనాథ్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఆషికకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమాలో ఇప్పటికే త్రిష ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరుకి నలుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారట. వారిలో ఒక సిస్టర్ రోల్ కి ఆషిక ని ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
ఆల్రెడీ విశ్వంభర సినిమాలో మీనాక్షి చౌదరి కూడా చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆషిక కూడా ఇప్పుడు ఆ సినిమాలో భాగం అవుతుంది. ఆషిక రంగనాథ్ లాంటి అందమైన హీరోయిన్ ని హీరోకి చెల్లి పాత్ర చేయించడం మెగా ఫ్యాన్స్ ని కాస్త నొప్పిస్తున్నా సినిమాలో ఆషిక ఉండటం వారిని ఖుషి చేస్తుంది. ఆషికని సరిగా వాడుకోవాలే కానీ అద్భుతాలు చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు.
నా సామిరంగ సినిమా తర్వాత అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఈ టైం లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓకే చేయకుండా కెరీర్ ప్లానింగ్ లో ఆచి తూచి అడుగులేస్తుంది అమ్మడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అందుకుంది అంటే ఆషికకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉండబోతుందని అర్థమవుతుంది. అమిగోర్స్ తో ఆరంభం చేదు ఫలితాన్ని ఇచ్చినా మలి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆషిక తెలుగులో తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. సీనియర్ హీరోలే కాదు యువ హీరోలతో కూడా తాను సై అనేస్తుంది అమ్మడు. ఈమధ్య టైర్ 2 హీరో సినిమాలో కూడా ఆషిక హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ గురించిన మిగతా డీటైల్స్ మాత్రం బయటకు రాలేదు.