Begin typing your search above and press return to search.

స‌క్సెస్ భామ ఫెయిల్యూర్ హీరోతో!

`అమిగోస్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అందాల న‌టి ఆషికా రంగ‌నాధ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 7:27 AM GMT
స‌క్సెస్ భామ ఫెయిల్యూర్ హీరోతో!
X

`అమిగోస్` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అందాల న‌టి ఆషికా రంగ‌నాధ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమా ఫెయిలైనా న‌టిగా మంచి ఐడెంటిటీ తీసుకొచ్చింది. అటుపై చేసిన `నా సామి రంగ‌`తో మాస్ ఆడియ‌న్స్ కి రీచ్ అయింది. దీంతో అమ్మ‌డి కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభ‌ర` లోనూ ఛాన్స్ అందుకుంది. ఇందులో మెగాస్టార్ కి జోడీ కాదు గానీ...కీల‌క మైన పాత్ర పోషిస్తుంది.


చిరు సినిమాలో అవ‌కాశం ప‌ట్ల ఎంతో సంతోషాన్ని పంచుకుంది. నాగార్జున‌, చిరుల స‌ర‌స‌న న‌టించ‌డంతో సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ పెయిర్ అనే పాజిటివ్ ఇంప్రెస‌న్ ప‌డుతోంది. ఇదే వేలో వెళ్తే న‌టిగా మ‌రింత బిజీ అవుతుందని అంతా భావిస్తున్నారు. వీట‌న్నింటిని మించి అందాల భామ‌గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. నెట్టింట అమ్మ‌డి ఫోటోలు అంత‌కంత‌కు ఆషీకా ఐడెంటిటీని రెట్టింపు చేస్తున్నాయి.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆషీకా ప్లాప్ హీరో సిద్ధార్ద్ సినిమాకి సైన్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిద్ధార్ధ్ హీరోగా రాజేష్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా ఆషీకారంగ‌నాధ్ ఎంపికైంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆషీకా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఎంపిక‌పై ఆషీకా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్లాప్ హీరోతో సినిమా ఏంటి? అని విమ‌ర్శిస్తున్నారు. సిద్దార్ధ్ ప‌రాజ‌యాల్ని గుర్తు చేస్తున్నారు.

సిద్దార్ధ్ ఫేం కోల్పోయి చాలా కాల‌మ‌వుతోంది. స‌రైన హిట్ కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. సిద్దార్ధ్ కు తెలుగులో `మ‌హా స‌ముద్రం `త‌ర్వాత అవ‌కాశాలే రాలేదు. అంత‌కు ముందు..ఆ త‌ర్వాత త‌మిళ సినిమాలే ఎక్కువ‌గా చేస్తున్నాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆషీకా సిద్దార్ధ్ కి జోడీగా క‌మిట్ అవ్వ‌డం కెరీర్ కి క‌లిసొస్తుందా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.