కొత్త సంవత్సరంలో `సెల్ఫిష్` రీస్టార్ట్?
ఈ యూత్ ఎంటర్ టైనర్ కి నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకుడు కాగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయిక.
By: Tupaki Desk | 29 Dec 2024 10:25 AM GMTఅగ్ర నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ హీరో, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి `రౌడీ బోయ్స్` చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. అతడు నటిస్తున్న రెండో సినిమా `సెల్ఫిష్` రకరకాల కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ యూత్ ఎంటర్ టైనర్ కి నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకుడు కాగా, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయిక.
ఈ సినిమా వాయిదా వెనక కారణాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిత్ర కథానాయకుడు ఆశిష్ మాట్లాడుతూ.. సినిమాని ఆపేయలేదని, నటుడు సునీల్ డేట్స్ కుదరలేదని తెలిపాడు. అలాగే కొంత పార్ట్ చిత్రీకరణ తర్వాత దానిపై అంతగా సంతృప్తి చెందలేదని, దానిని రీషూట్ చేస్తామని కూడా తెలిపాడు. ఈ లోగానే లవ్ మీ స్క్రిప్టు నచ్చడంతో 54 రోజుల్లోనే ఆ సినిమాని పూర్తి చేయడానికి సమయం కేటాయించానని వెల్లడించాడు.
తాజా సమాచారం మేరకు `సెల్ఫిష్` ఆగిపోలేదు.. తిరిగి కొత్త సంవత్సరంలో రీలాంచ్ అవుతుంది.. రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. కొత్త సంవత్సరంలో శిరీష్- ఆశిష్ రెడ్డి బృందం బెటర్ స్క్రిప్ట్‌తో ముందుకు వెళతారని సమాచారం. ఆశిష్ తో కలిసి సుకుమార్ సారథ్యంలో రైటింగ్ టీమ్ దీనిపై వర్క్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్ టీమ్ ఇప్పటికే సెల్ఫిష్ స్క్రిప్టులో అవసరం మేర మెరుగులు అద్దుతోందని సమాచారం. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు- శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.