పెళ్లికి అఖిల్ ని ఆహ్వానించిన అశిష్!
ఇప్పటికే పలువురు యంగ్ హీరోలకు వెడ్డింగ్ కార్డు అందించిన అశిష్ తాజాగా అక్కినేని అఖిల్ ని కలిసి వెడ్డింగ్ కార్డు అందించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 Feb 2024 4:06 AM GMTఅగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మ్రోగనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడి కుమారుడు హీరో అశిష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్దం కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతలు మొత్తం దిల్ రాజు తీసుకున్నటు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను ఒక్కొక్కరిగా కలిసి ఆహ్వాన పత్రికను అందిస్తూ వస్తున్నారు.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి మొదటి పెళ్లి పత్రికను అందజేసిన దిల్ రాజు అటుపై జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారు. ఈ సందర్భంగా పెళ్లి శుభలేఖను దిల్ రాజు - శిరీష్ కలిసి ఎన్టీఆర్ కి అందజేశారు. ఇలా అన్నద మ్ములు ఇద్దరు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులందరనీ స్వయంగా కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక అందిస్తున్నారు. మరోవైపు అషిష్ ఇండస్ట్రీలో తన స్నేహితుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించే పనిలో పడ్డాడు.
ఇప్పటికే పలువురు యంగ్ హీరోలకు వెడ్డింగ్ కార్డు అందించిన అశిష్ తాజాగా అక్కినేని అఖిల్ ని కలిసి వెడ్డింగ్ కార్డు అందించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి సమమం దగ్గర పడటంతో కార్డుల పంపిణీ కార్యక్రమం స్పీడప్ చేసారు. ఇండస్ట్రీలో ఎవర్నీ మిస్ అవ్వ కుండా అందరికీ ఆహ్వాన పత్రికలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దిల్ రాజు టీమ్ కూడా ఈ పనిలో నిమగ్నమైంది.
కాగా ఆశిష్- అద్విత రెడ్డి ల పెళ్లి ఫిబ్రవరి 14న జైపూర్ లో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆశిష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆంధ్రపదేశ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయిన అద్విత రెడ్డిని ఆశిష్ పెళ్లి చేసుకోబో తున్నాడు.ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా చేసుకున్న ఈ జంట పెళ్లి మాత్రం ఎంతో గ్రాండ్ గా చేసుకోబోతున్నారు.