Begin typing your search above and press return to search.

లవ్ మీ.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

టాలీవుడ్‌లోకి చాలా రోజుల తరువాత విభిన్నమైన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది

By:  Tupaki Desk   |   22 May 2024 10:18 AM GMT
లవ్ మీ.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?
X

టాలీవుడ్‌లోకి చాలా రోజుల తరువాత విభిన్నమైన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే "లవ్ మీ" అనే సినిమా. ఈ హీరో ఓ దెయ్యంతో ప్రేమలో పడిపోవడం చుట్టూ కథ తిరుగుతుంది. సినిమాలో ఆశిష్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక సినిమాలో హారర్ విజువల్స్ తో పాటు మంచి లవ్ ట్రాక్ హైలెట్ కానున్నట్లు చెప్పారు. అయితే దెయ్యం పాత్రను ఎవరు పోషించారో మాత్రం చిత్రబృందం వెల్లడించలేదు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆశిష్ ఈ విషయంలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. వారి వివరాలను ఇప్పటివరకు ఎవరికి తెలియనీయలేదు. ప్రేక్షకులు థియేటర్‌లో ఈ సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌ని ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం. వైష్ణవి చైతన్య ప్రధాన హీరోయిన్ అని చెప్పారు.

ఇక సినిమాలో మిగతా మహిళా పాత్రలు కథను ముందుకు తీసుకువెళ్తాయి. దెయ్యం పాత్రను పోషించిన వ్యక్తిని కూడా కలుపుకుంటే, 'లవ్ మీ' లో మొత్తం ఆరుగురు హీరోయిన్లు ఉన్నారుని తెలిపారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవారపు దర్శకత్వం వహిస్తున్నారు, మరియు హర్షిత్ రెడ్డి, హంషిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. "లవ్ మీ" చిత్రం మే 25న విడుదల కానుంది. ఇక సినిమాకు సంబంధించిన మరొక పాటను విడుదల చేశారు. ఏమవుతుందో అనే ఈ పాటలో ఆశిష్, దెయ్యం మధ్యలో కెమిస్ట్రీ హైలెట్ అవుతోంది. ఒకవైపు ప్రేమను మరోవైపు థ్రిల్లింగ్ ఏమోషన్ ను పాటలో చూపించారు.

కీరవాణి మెలోడీ మ్యూజిక్ కు తగ్గట్టుగా చంద్రబోస్ రచన, నితీష్ - గోమతి అయ్యర్ పాడిన విధానం పాటకు మరింత అందాన్ని ఇచ్చింది. దెయ్యంతో పూర్తిగా ప్రేమలో పడిన కుర్రాడు ఆ ఆత్మతో ఇంత రిస్క్ ఎందుకు చేస్తాడు అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

ఈ సినిమాలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, విభిన్నమైన కథ, మరియు ఐదుగురు హీరోయిన్ల పాత్రలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడం ఖాయం అని చెబుతున్నారు. దెయ్యం పాత్రను ఎవరు పోషించారో తెలియడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఆశిష్ మాట్లాడుతూ, సినిమా యొక్క ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.