మహేష్ మామయ్య కాదు..!
మొత్తానికి తన సినిమాలో మహేష్ మామ లేడు అంటూ అశోక్ క్లారిటీ ఇచ్చినప్పటికీ సినిమాకు మాత్రం పుకార్ల వల్ల మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు.
By: Tupaki Desk | 30 Oct 2024 6:12 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం పెంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో మహేష్ బాబు ఒక సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారని, అది కూడా శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. తన మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాలో మహేష్ బాబు గెస్ట్‌గా కనిపించబోతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా షాక్ అయ్యారు.
మహేష్ బాబును కృష్ణుడిగా చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే మహేష్ బాబు గడ్డం, జుట్టు పెంచి ఉన్నారు. జుట్టు పర్వాలేదు కానీ గడ్డంతో కృష్ణుడిగా కనిపించడం సాధ్యం కాదు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. ఆ వార్తలు నిజం కాదని చాలా మంది అనుకున్నారు. ఆ వార్తలు కేవలం పుకార్లే అని స్వయంగా హీరో అశోక్ గల్లా అధికారికంగా ప్రకటించాడు. మామయ్య మహేష్ బాబు తన సినిమాలో నటించలేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఆయనతో నటించడం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు.
తాజా ఇంటర్వ్యూలో అశోక్ గల్లా మాట్లాడుతూ... దేవకీ నందన వాసుదేవ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ఆయన ప్రస్తుతం పూర్తిగా రాజమౌళి గారి సినిమా పనిలో ఉన్నారు. ఆ సినిమా కాకుండా ఆయన మనసులో మరే సినిమా ఉండే అవకాశం లేదు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే మరేదైనా సినిమాను మహేష్ బాబు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి తన సినిమాలో మహేష్ మామ లేడు అంటూ అశోక్ క్లారిటీ ఇచ్చినప్పటికీ సినిమాకు మాత్రం పుకార్ల వల్ల మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇక మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచిన ఆ సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి రాజమౌళి సినిమా రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కాబోతున్న ఆ సినిమాను 2026 చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను భారీ అడ్వెంచర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది.