వావ్.. అషురెడ్డి అందాల బీభత్సం
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
By: Tupaki Desk | 12 Nov 2024 4:23 PM GMTసోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ భామ ఆషురెడ్డి ఇటీవల కాలంలో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆమె ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ హై లెవెల్లోనే హైలెట్ అవుతోంది. ప్రస్తుతం పోర్చుగల్‌లోని లిస్బన్ వీధుల్లో తన అందం, గ్లామర్‌తో రచ్చ చేస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
బ్లూ కలర్లో స్లిమ్-ఫిట్ అవుట్‌ఫిట్ ధరించిన ఆమె, అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌తో తీసుకున్న ఈ ఫోటోషూట్‌లో సింపుల్ పర్ల్ నెక్లెస్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ స్టన్నింగ్ లుక్స్‌తో ఆషురెడ్డి తన ప్రత్యేక గ్లామర్‌ను మరోసారి ప్రదర్శించింది. ఆషురెడ్డి కెరీర్ ప్రారంభంలో జూనియర్ సమంతగా గుర్తింపు పొందినా, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అందుకుంటోంది.
బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఆ తరువాత ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ, ఆమెకు ఊహించని క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు, బాలీవుడ్ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ, సౌత్ ఇండస్ట్రీలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా గ్లామరస్ ఫోటోషూట్లను పంచుకుంటూ తన ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు అలరిస్తుంది.
ఈ లిస్బన్ ట్రిప్‌లో బ్లూ డ్రెస్సులో తీసుకున్న ఫోటోలతో ఆషురెడ్డి తన స్టైలింగ్ సెన్స్నీ మరింతగా ఎలివేట్ చేసింది. లిస్బన్ వీధుల్లో పోర్చుగీస్ సిటీలో తీసుకున్న ఈ ఫోటోలు వావ్ అనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఆమె ఈ గ్లామర్ షోపై స్పందిస్తూ, ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “ఒకప్పటి జూనియర్ సమంత ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది” అంటూ నెటిజన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.
బోల్డ్ లుక్స్‌లో చూపు సలపనంత అందం అందిస్తున్న ఆషురెడ్డి, ప్రస్తుతానికి సౌత్ ఇండస్ట్రీలోని గ్లామర్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. ఈ తాజా ఫోటోషూట్ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుతుంది అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం వివిధ అవకాశాల కోసం వెదుక్కుంటూ, రెగ్యులర్‌గా తన ప్రొఫైల్‌ను అప్డేట్ చేస్తోంది. ఇక గ్లామర్‌లో మరో స్థాయికి ఎదిగే దిశగా ఆమె ప్రయాణం కొనసాగిస్తోంది.