ఆషు రెడ్డి హై గ్లామర్ ట్రీట్.. ఎవరైనా పోటీ ఇవ్వగలరా?
కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీస్ రెగ్యులర్ గా రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్ లతో వీక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Nov 2024 7:49 AM GMTఈ మధ్యకాలంలో వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే అందాల భామలు గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలలో అయితే క్యారెక్టరైజేషన్స్ బట్టి అవుట్ ఫిట్ లో ఉంటాయి. అయితే ఈ మధ్య కాస్తా గ్లామర్, అండ్ మోడ్రన్ టచ్ కథలు తక్కువగా వస్తున్నాయి. దాంతో గ్లామర్ షోకి పెద్దగా స్కోప్ దొరకడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీస్ రెగ్యులర్ గా రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్ లతో వీక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తున్నారు.
తెలుగు భామలు కూడా గ్లామర్ షో విషయంలో పోటీ పడుతున్నారు. తగ్గేది లే అంటూ మోడ్రన్ అవుట్ ఫిట్ లతో గ్లామర్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. తెలుగమ్మాయి ఆషు రెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ సమంత అనే బ్రాండ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆషు రెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత సెలబ్రెటీ స్టేటస్ సొంతం చేసుకుంది.
అప్పటి నుంచి జూనియర్ సమంత అనే ఇమేజ్ కి దూరంగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం చాలా మందికి పోటీ ఇస్తోంది. రెగ్యులర్ గా అదిరిపోయే గ్లామర్ కాస్ట్యూమ్స్ తో మెస్మరైజ్ చేసే ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ఆషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది.
వీటిని లక్షల్లో నెటిజన్లు వీక్షిస్తూ ఉంటారు. ఆమె గ్లామర్ షోకి ఫిదా కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ అమ్మడు స్కై బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే అందంతో ఐష్ చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ లుక్స్ లో ఏ హీరోయిన్ కూడా ఆషుకి పోటీ ఇవ్వలేదనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. అందానికి మెరుగులు అద్ది మోడ్రన్ ఏంజిల్ లా ఆషు రెడ్డి ఈ లుక్స్ లో కనిపిస్తోందని ఆమె అభిమానులు అంటున్నారు.