Begin typing your search above and press return to search.

అహో ఆషు.. గ్లామర్ సెగలు మామూలుగా లేవు

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు భామలలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ హైప్ ఉన్న బ్యూటీ అంటే చాలా మంది ఆషు రెడ్డి పేరు చెబుతారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 6:07 AM GMT
అహో ఆషు.. గ్లామర్ సెగలు మామూలుగా లేవు
X

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు భామలలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ హైప్ ఉన్న బ్యూటీ అంటే చాలా మంది ఆషు రెడ్డి పేరు చెబుతారు. ఈ అమ్మడు డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత అనే ఇమేజ్ తో సోషల్ మీడియాలో అందరికి చేరువ అయ్యింది. తరువాత బుల్లితెర రియాలిటీ షోలలో కనిపించింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆషు రెడ్డి స్టార్ ఇమేజ్ అందుకుంది.

ఆపై తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ ని అందుకుంది. అలాగే బుల్లితెర రియాలిటీ షోలలో హోస్ట్ గా అలరించింది. ఈమె సోషల్ మీడియాలో కెరియర్ స్టార్ట్ చేసిన ఆరంభంలో బొద్దుగా ఉండేది. తరువాత వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ లుక్ లోకి మారింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఆషు రెడ్డి జూనియర్ సమంత అనే ఇమేజ్ చట్రం నుంచి పూర్తిగా బయటకొచ్చింది.

తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఆషు రెడ్డి అదిరిపోయే ఈ గ్లామర్ ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఆమె గ్లామర్ ఫీస్ట్ అని చెప్పాలి. డిఫరెంట్ మోడరన్ అవుట్ ఫిట్ లతో రెగ్యులర్ గా ఫోటోషూట్ లని ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.

ఇవి యూత్ ని భాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. తెలుగమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఫోటోషూట్ లలో గ్లామర్ డోస్ పెంచారు. అయితే అందరికంటే దీటుగా, ఘాటుగా ఆషు రెడ్డి గ్లామర్ ఫోటోలు ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ ఫోటోలు విజువల్ ఫీస్ట్ గా ఉంటున్నయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ స్కర్ట్ తో అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట షేక్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఆషు రెడ్డి లుక్స్ ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆషు రెడ్డి ఫాలోవర్స్ అయితే అదిరిపోయే కామెంట్స్ తో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.