Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ మహేష్ కి తమిళ్ దర్శకుడి రిక్వెస్ట్..!

లవ్ టుడే తర్వాత ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ చేసిన డ్రాగన్ కూడా యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

By:  Tupaki Desk   |   4 March 2025 3:00 AM IST
సూపర్ స్టార్ మహేష్ కి తమిళ్ దర్శకుడి రిక్వెస్ట్..!
X

తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈమధ్యనే డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహార్ హీరోయిన్స్ గా నటించారు. ఐతే ఈ సినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ గా తెలుగులో రిలీజైంది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. లవ్ టుడే తర్వాత ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ చేసిన డ్రాగన్ కూడా యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త సెన్సేషన్ గా మారాయి.

ఐతే ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి అయ్యింది. అందుకే తెలుగులో కూడా సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ తో పాటుగా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు ఇంకా నిర్మాతలు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. సినిమాని ప్రేక్షకులు ఆదరించిన తీరుపై డైరెక్టర్ క్రేజీ కామెంట్స్ చేశాడు.

అంతేకాదు మీడియాకు అశ్వత్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశాడు. అదేంటి అంటే తన ఫస్ట్ సినిమా ఓ మై కడవులే సినిమాను సూపర్ స్టార్ మహేష్ చూసి ట్వీట్ చేయగా ఆ సినిమా గురించి అందరు మాట్లాడారని. ఆ సినిమా ఓరి దేవుడాగా చేశానని ఐతే డ్రాగన్ సినిమా మహేష్ బాబు చూసేలా ఆయన దాకా తన ఈ రిక్వెస్ట్ ని తీసుకెళ్లాలని అన్నారు అశ్వత్. మహేష్ సార్ ఈ సినిమా చూడాలన్నది తన కోరిక అని అన్నాడు అశ్వత్.

మొత్తానికి తన సినిమాను మొదట గుర్తించి ట్వీట్ వేసిన మహేష్ ని అశ్వత్ మర్చిపోలేదు. మహేష్ ట్వీట్ చేసిన తర్వాతనే ఆ సినిమా గురించి ఎక్కువమందికి తెలిసింది. 2020 లో వచ్చిన ఓ మై కడవులే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఆ సినిమాను ఓరి దేవుడాగా రీమేక్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా కూడా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

ఐతే డ్రాగన్ సినిమా మాత్రం యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేయగా ఇంకా చాలా చోట్ల బాగానే రన్ అవుతుంది. అశ్వత్ మారిముత్తు సినిమా అంటే యూత్ కి కచ్చితంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అనిపించేలా చేసుకున్నాడు. ప్రదీప్ కాంబినేషన్ లో ఐతే ఇక 100 కోట్ల దాకా రాబట్టి ఈ కాంబినేషన్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది.