Begin typing your search above and press return to search.

కల్కి బిజినెస్.. అశ్వనీదత్ డీలింగ్ అంటే అట్లుంటది మరి

ఎందుకంటే పెద్దగా పోటీగా కూడా ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి కల్కి ఈ టైంలో వచ్చి ఉంటే జాక్ పాట్ కొట్టేది అనేది మాత్రం వాస్తవం.

By:  Tupaki Desk   |   16 April 2024 12:02 PM GMT
కల్కి బిజినెస్.. అశ్వనీదత్ డీలింగ్ అంటే అట్లుంటది మరి
X

ప్రభాస్ నెక్స్ట్ సినిమా కల్కి 2898AD బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఏమో కానీ విడుదలకు ముందు మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ ను చాలా టెన్షన్ పెట్టేస్తోంది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ ని కూడా మిస్ చేసుకుంది. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ సమ్మర్ చాలా ఉపయోగపడేది. ఎందుకంటే పెద్దగా పోటీగా కూడా ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి కల్కి ఈ టైంలో వచ్చి ఉంటే జాక్ పాట్ కొట్టేది అనేది మాత్రం వాస్తవం.

ఇక మే 9వ తేదీన విడుదల చేయాలని అనుకున్నప్పటికీ అప్పుడు ఎలక్షన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమాను మే చివరలో లేదా జూన్లో విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయం కోసమే కొన్ని డీల్స్ కూడా చాలా రోజుల వరకు హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ అలాగే నిర్మాతల్లో ఒకరైన స్వప్న దత్ ప్రియాంక అందరూ కూడా మేకింగ్ విషయంలో చాలా బిజీగా ఉండగా, వైజయంతి అధినేత అశ్వినిదత్ మాత్రం బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీ అయిపోయారు.

ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ తో ఆయన చర్చిస్తూ రిలీజ్ డేట్ విషయంలో కూడా వారి నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ఏపీ తెలంగాణ బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. మొదట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ఊహించని స్థాయిలో కోత్ చేస్తున్నారు అనే విధంగా కూడా టాక్ అయితే వినిపించింది.

దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో అశ్వినీ దత్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండానే బిజినెస్ డీల్స్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. 50 ఏళ్ల అనుభవం ఉన్న నిర్మాణ సంస్థ కావడంతో బిజినెస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఇక 120 కోట్ల రేంజ్ లోనే రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ అమ్ముడుపోవడం కష్టం అనుకున్న తరుణంలో ఆయన ఏకంగా 190 కోట్ల రేంజ్ లో డీల్స్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా నైజాం రైట్స్ దాదాపు 75 కోట్లకు ఓకే అయినట్లు సమాచారం. ఇక ఆంధ్ర లో 80 నుంచి 90 కోట్ల మధ్యలో ధర పలికినట్లుగా తెలుస్తుంది. ఇక సీడెడ్ లో 30 కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్. మొదట డిస్ట్రిబ్యూటర్స్ కాస్త వెనుకడుగు వేసినప్పటికీ ఎలాగూ మళ్లీ సెకండ్ పార్ట్ ఉంది కావున అప్పుడు కూడా సినిమా రిజల్ట్ ని బట్టి రేట్ల విషయంలో సర్దుబాటు జరిగే అవకాశం కూడా ఉంటుందని అశ్వినిదత్ మాట ఇచ్చినట్లు సమాచారం.

ఇక ఆయన మాట మీదనే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ స్థాయిలో రిస్క్ చేసినట్లుగా తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విషయంలో డౌట్స్ ఉన్నా కూడా కంటెంట్ క్లిక్కయితే తిరుగుండదు అని అందరికి తెలుసు. ఏదేమైనా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయితేనే గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. మరి మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.