Begin typing your search above and press return to search.

అమితాబ్ కాళ్ళు మొక్కడంపై అశ్వినీ దత్ ఓపెన్ లెటర్

అశ్వినీదత్ బ్యానర్ నుంచి ఒక కొత్త సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో మంచి విషయం ఉంటుందనే బ్రాండ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయ్యింది

By:  Tupaki Desk   |   21 Jun 2024 8:15 AM GMT
అమితాబ్ కాళ్ళు మొక్కడంపై అశ్వినీ దత్ ఓపెన్ లెటర్
X

టాలీవుడ్ బడా నిర్మాత అశ్వినీ దత్ సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆ నాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు ప్రభాస్ తో చేసిన కల్కి 2898ఏడీ వరకు చాలా మంది హీరోలతో అశ్వినీదత్ వర్క్ చేశారు. అలాగే ఎంతో మంది స్టార్ దర్శకులతో కూడా అశ్వినీదత్ మూవీస్ చేసి సక్సెస్ లు అందుకున్నారు. అశ్వినీదత్ బ్యానర్ నుంచి ఒక కొత్త సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో మంచి విషయం ఉంటుందనే బ్రాండ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయ్యింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అశ్వినీ దత్ కి సీనియర్ నిర్మాతగా మంచి పేరుంది. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ సమర్పణలో కల్కి 2898ఏడీ మూవీ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని స్వప్నదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో స్టార్ లెజెండరీ యాక్టర్స్ అయిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ని కీలక పాత్రల కోసం తీసుకున్నారు.

దీంతో కల్కి మూవీ భారీ మల్టీ స్టారర్ చిత్రంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. అందులో బిగ్ బి అమితాబచ్చన్ అశ్వినీదత్ కళ్ళకి నమస్కరించారు. ఈ దృశ్యం అందరిని షాక్ కి గురిచేసింది. బాలీవుడ్ మీడియా ఈ ఫోటోలని ప్రధానంగా హైలైట్ చేసింది. దీనిపై అశ్వినీదత్ లేఖ విడుదల విడుదల చేశారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏది ఎక్కువ కాదు. అలాగే ఎవరూ గొప్ప కాదు. అమితాబ్ బచ్చన్ తన కాళ్ళకి నమస్కరించడం అస్సలు ఊహించని విధంగా యాదృశ్చికంగా జరిగిపోయింది. నిజంగా ఆయన ప్రేమతో ఆప్యాయంగా నాకు ఇచ్చిన ఆ గౌరవం వెలకట్టలేనిది. ఆయన అందించిన ప్రేమ, ఆప్యాయతని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన వ్యక్తిత్వం, గుర్తింపు హిమాలయాల కంటే ఎత్తైనవి.

అమితాబ్ జి మనస్పూర్తిగా అందించిన ఆ గౌరవానికి నేను కూడా అంతే మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమితాబ్ గారు అన్ని శతాబ్దాలకి ఒక లెజెండరీగా అతని వ్యక్తిత్వంతో, గొప్ప ఆలోచనలతో నిలిచిపోతారు. అంటూ అశ్వినీ దత్ తన రియాక్షన్ ని తెలియజేశారు. అశ్వినీ దత్ కాళ్ళని అమితాబ్ బచ్చన్ తాకడంపై కొందరు విమర్శలు చేశారు. అశ్వినీ దత్ ఆ ఘటనపై అంతే హుందాగా రియాక్ట్ అయ్యి అమితాబ్ బచ్చన్ గొప్పతనం గురించి లేఖలో తెలియజేయడం విశేషం.