Begin typing your search above and press return to search.

మ్యాడ్ మ్యాక్స్ ఇంటరాక్షన్.. నవ్వులే నవ్వులు!

ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు.. ఈ విషయం ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 6:45 PM GMT
మ్యాడ్ మ్యాక్స్ ఇంటరాక్షన్.. నవ్వులే నవ్వులు!
X

కొత్త కాన్సెప్టులతో తెరకెక్కిన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తుంటారు సినీ ప్రియులు. ప్రయోగాలకు కూడా బ్రహ్మరథం పడుతుంటారు. ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు.. ఈ విషయం ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవకు చెందిన మరో సినిమా డార్లింగ్. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ కమెడియన్ ప్రియదర్శి, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోహీరోయిన్లుగా ఆ మూవీ తెరకెక్కుతోంది.


అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న డార్లింగ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. జులై 19వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుని.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్.. సినిమాపై అంచనాలను మరిన్ని పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్.


అందులో భాగంగా.. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తో స్పెషల్ ప్రమోషనల్ వీడియోను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో సూపర్ రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యాడ్ మ్యాక్స్ ఇంటరాక్షన్ విత్ అనుదీప్ అంటూ షేర్ చేశారు. తన రూమ్ డోర్ పై ఫ్యామిలీ ఇన్ సైడ్.. డోంట్ డిస్టర్బ్ అంటూ అనుదీప్ పెట్టిన బోర్డు నవ్వులు పూయిస్తోంది. అందరూ ప్రమోషన్స్ కోసం డిస్టర్బ్ చేస్తున్నారని, అందుకే పెట్టానని చెబుతారు అనుదీప్.


బెల్లంతో లడ్డూలు చేశానని చెప్పి..ప్రియదర్శితోపాటు డైరెక్టర్ అశ్విన్ రామ్ కు ఇస్తారు అనుదీప్. సినిమాలో సాంగ్ వినకుండానే బాగుందని చెబుతారు. ఫస్ట్ లిరిక్ అడిగితే మళ్లీ విని చెప్తానంటారు. కల్కి సినిమాలో అనుదీప్ రోల్ వచ్చినప్పుడు.. ఆడియన్స్ ఓ రేంజ్ లో సందడి చేశారని అశ్విన్ రామ్ చెబుతారు. అనుదీప్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ను అడుగుతారు. డార్లింగ్ సినిమా చూడాలని ప్రియదర్శి కోరగా.. ఓకే అంటారు అనుదీప్.

టీ, జ్యూస్ లేదా అంటే.. కాకరకాయ జ్యూస్ ఇస్తానని చెబుతారు అనుదీప్. అలా నవ్వులు పూయిస్తారు. చివరలో డార్లింగ్ సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని ఆడియన్స్ ను కోరారు. అయితే అనుదీప్ ఇది వరకే చేసిన ఇంటర్వ్యూల్లాగే ఇది కూడా మంచి ఫన్ తో కొనసాగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. మరి త్వరలో రిలీజ్ కానున్న డార్లింగ్ మూవీ.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.