Begin typing your search above and press return to search.

ఆమెకు లేని బాధ మీకెందుకు..? ముద్దు వివాదంపై డైరెక్టర్..!

హీరోయిన్ అనుమతి లేకుండా ముద్దు ఎలా పెడతారని మరి కొందరు విమర్శించారు. ఈ విషయం పెద్ద వివాదం కావడంతో, డైరెక్టర్ స్పందించారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 10:30 AM GMT
ఆమెకు లేని బాధ మీకెందుకు..? ముద్దు వివాదంపై డైరెక్టర్..!
X

గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా య‌జ్ఞం చెప్పొచ్చు. ఈ మూవీకి ఏ.ఎస్‌. ర‌వికుమార్ చౌద‌రి దర్శకత్వం వహించారు. ఆ హిట్ తో ఆయన బాలయ్యతో కలిసి వీరభద్ర చేశారు. అది బెడిసికొట్టింది. ఆ తర్వాత , సాయి ధ‌రమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి హిట్ అందించారు. ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. తర్వాత వరసగా ప్లాప్ లు రావడంతో వెకనపడిపోయారు. చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ హీరోగా 'తిర‌గ‌బ‌డ‌రాసామీ' అంటూ ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ని రూపొందిస్తున్నారు. ఇందులో మ‌న్నారా చోప్రా న‌టిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు.

ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన హీరోయిన్ మన్నారా చోప్రాతో అతిగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే ఆమెకు ముద్దు పెట్టాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. దీంతో, డైరెక్టర్ ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో తెలీదా అని కొందరు విమర్శిస్తుంటే, హీరోయిన్ అనుమతి లేకుండా ముద్దు ఎలా పెడతారని మరి కొందరు విమర్శించారు. ఈ విషయం పెద్ద వివాదం కావడంతో, డైరెక్టర్ స్పందించారు.

మన్నారాని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అని ఆయన రివర్స్ లో ప్రశ్నించడం గమనార్హం.తానేమీ కసిగా ముద్దు పెట్టలేదన్నారు. ఆప్యాయతతో మాత్రమే పెట్టానని చెప్పారు. తన కూతురికైనా తాను అలాగే ముద్దు పెడతానని చెప్పడం విశేషం. ఆ అమ్మాయి లేని నొప్పి మిగితావాళ్లకు ఎందుకు అని ప్రశ్నించారు. మన్నారాకు ఏ సమస్యా లేదని, తన భార్యకు కూడా లేని బాధ వేరేవాళ్లకు ఎందుకు అన్నారు. ఈ సినిమా కోసం తాను చలా కష్టపడిందని, అందుకే ముద్దు పెట్టానని చెప్పారు.

నిజానికి, ఆ వీడియో ప్రకారం, ఆయన ముద్దు పెట్టినప్పుడు మన్నారా కనీసం సీరియస్ లుక్ కూడా ఇవ్వలేదు. సడెన్ గా ఆయన ముద్దు పెట్టినప్పుడు షాకైనా వెంటనే నవ్వేసి, థాంక్యూ సర్ అని చెప్పేసింది. పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి, ఇబ్బంది కలిగినా, ఆమె అలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అనేది నెటిజన్ల వాదన. ఆయన మాత్రం తన చర్యలను సమర్థించుకున్నారు.

ఇక, ఈ తిరగబడరా స్వామి సినిమా విషయానికి వస్తే, స్వ‌త‌హాగా భ‌య‌స్తుడైన ఓ యువ‌కుడు తిర‌గ‌బ‌డితే ఏం జ‌రిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించారు. టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా మాస్ యాక్ష‌న్ అంశాల‌తో నిండి ఉంది. టీజ‌ర్ దిల్ రాజు విడుదల చేశారు. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.