అసిస్టెంట్ల ధర్నా.. డైరెక్టర్ మండిపాటు..!
తెర మీద సినిమా చూస్తే ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో దాని వెనక చిత్ర యూనిట్ కష్టం ఒక రేంజ్ లో ఉంటుంది
By: Tupaki Desk | 14 Aug 2024 8:30 PM GMTతెర మీద సినిమా చూస్తే ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో దాని వెనక చిత్ర యూనిట్ కష్టం ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమాకు సంబంధించిన 24 విభాగాలకు సంబంధించి అందరు రాత్రి పగలు లేకుండా కష్టపడితే ఆ సినిమా పూర్తవుతుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఈ కష్టం మాత్రం ఒకటే. బ్లాక్ బస్టర్ సినిమాకు డైరెక్టర్ అండ్ టీం మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎంత కష్టపడుతుందో ఫ్లాప్ సినిమాకు కూడా అంతే కష్టపడుతుంది. అసలు సినిమా ఫలితాన్ని ముందే గెస్ చేసే అవకాశం ఎవరికి ఉండదు. ఐతే కొన్నిసార్లు డైరెక్టర్స్ చేత అతని అసిస్టెంట్స్ తిట్లు తినాల్సి వస్తుంది.
పనిలో భాగంగా డైరెక్టర్ ఎవరెవరి మీద కోపమో తన అసిస్టెంట్స్ మీద చూపిస్తుంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏమో కానీ అప్పట్లో డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన వాళ్లైతే ఆ డైరెక్టర్ కి ఎప్పుడు కోపం వస్తుందా అని భయపడిపోయే వారు. ఐతే ఇదంతా సినిమా కోసం మంచి అవుట్ పుట్ తీసుకు రావడం కోసమే అన్నది తెలిసిందే. ఐతే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ పై రుసరుసలాడుతారన్న టాక్ ఉంది. రీసెంట్ గా మురారి రీ రిలీజ్ టైం లో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన నందిని రెడ్డి మాట్లాడుతూ ధర్నా చేశామన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఐతే ఇదే విషయంపై ఓ నెటిజన్ అసిస్టెంట్స్ ధర్నా చేసినప్పుడు మీకు కోపం వచ్చిందా అని అడిగితే కోపం కాదు సార్ అది వర్క్ రెస్పాన్సిబిలిటీ.. అలా లేకపోతేనే నేను తీసుకోలేనని అన్నారు కృష్ణవంశీ. అసిస్టెంట్ డైరెక్టర్స్ రేపటి ఫ్యూచర్ డైరెక్టర్స్, వాళ్లు ఏదైనా చేయగలిగేలా చేసేలా ఉండాలి.. వాళ్లు అప్పుడు కిడ్స్ 12, 14 గంటలు పనిచేసిన తర్వాత సాధారణంగా ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది నేను అర్థం చేసుకుంటా అందుకే కోపం రాలేదని అన్నారు కృష్ణవంశీ.
అప్పుడు కృష్ణవంశీ దగ్గర అంత హార్డ్ వర్క్ తో పని నేర్చుకున్నారు కాబట్టే నందిని రెడ్డి, శ్రీ వాస్, శోభన్ లాంటి వారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. మురారి రీ రిలీజ్ తర్వాత కృష్ణవంశీ తిరిగి మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక సినిమా రీ రిలీజ్ వల్ల డైరెక్టర్ కు మేలు జరగడం అంటే అది ఇదే అని చెప్పొచ్చు.