Begin typing your search above and press return to search.

విశ్వంభర.. ఓ క్లారిటీ వచ్చేసింది

ఇదిలా ఉంటే, ఇటీవల విశ్వంభర సినిమా ఓటీటీ డీల్ వలన ఆలస్యం అవుతుందనే టాక్ పరిశ్రమలో తెగ హాట్ టాపిక్ అయింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:21 PM GMT
విశ్వంభర.. ఓ క్లారిటీ వచ్చేసింది
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటమే కాకుండా, చిరంజీవి పాత్ర గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సౌషియో ఫాంటసీ జానర్ లో భారీగా తెరకెక్కుతోంది. త్రిష ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల విశ్వంభర సినిమా ఓటీటీ డీల్ వలన ఆలస్యం అవుతుందనే టాక్ పరిశ్రమలో తెగ హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఓటీటీ సంస్థలకు ఒక ఏడాదిలో ఒక లిమిట్ బడ్జెట్ ఉంటుంది. టాప్ ఓటీటీ సంస్థలు ఇప్పటికే కొన్ని సినిమాలను భారీ ధరలకు కొనుగోలు చేయడంతో లిమిట్ ఫినిష్ అయినట్లు టాక్.

ఇక విశ్వంభర మేకర్స్ అడిగిన రేటు విషయంలో ఓటీటీ సంస్థలు ధైర్యం చేయలేకపోతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో మాట. సినిమా మీద కాన్ఫిడెన్స్ మీద ఉన్న మేకర్స్ రేటు విషయంలో అస్సలు తగ్గడం లేదట. ఈ విధంగా ఓటీటీ డీల్ కారణంగా కొంత ఆగి సినిమాను విడుదల చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ అందులో నిజం లేదని ఒక క్లారిటీ వచ్చింది.

ఈ టాక్ పై యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. విశ్వంభర సినిమాకు సంబంధించి ఎలాంటి ఆలస్యం ఉండదని, సంక్రాంతికి అనుకున్న విధంగానే సినిమా విడుదలవుతుందని అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఓటీటీ డీల్ పై చర్చలు జరిగినా, ఆ డీల్ పూర్తయినా లేదా కుదరకపోయినా, విశ్వంభర సినిమా విడుదల తేదీలో మార్పు ఉండబోదని యూవీ ఫిలింస్ వెల్లడించింది.

దర్శకుడు మల్లిడి వశిష్ట కూడా ఇదివరకే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "10-1-2025 విజృంభణం.. విశ్వంభర ఆగమనం!!" అంటూ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10 థియేటర్లలో విడుదల కానుందని స్పష్టం చేశారు. దీంతో, గత కొంత కాలంగా వస్తున్న వాయిదా వార్తలకు తెరపడింది.

విశ్వంభర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఒక పాట మరియు కొంత టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ లో ఉందని టాక్. అలాగే, వీఎఫ్ఎక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నందున, మేకర్స్ విస్మయపరిచే విజువల్స్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.