మొత్తానికి దిగొచ్చి సమంతకు సారీ చెప్పాడు!
సమంత కూడా సుదీర్ఘ పోస్ట్‌లో అతడి పదునైన విమర్శలకు ధీటుగా ప్రతిస్పందించడమే గాక.. మర్యాదగా ఉండమని తనదైన శైలిలో సీరియస్ గా కోరింది.
By: Tupaki Desk | 10 July 2024 3:06 PM GMTహైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్(ఆవిరి పట్టడం)ను ఉపయోగించడం గురించి సమంతా రూత్ ప్రభు ఇటీవల చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో భారీ చర్చకు దారితీసింది. సామ్ పోస్ట్‌కు నెటిజనుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా 'ది లివర్ డాక్' సమంతా పోస్ట్‌పై ఘాటుగా స్పందించారు. అలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులను సమర్థిస్తున్నందుకు సమంతను విమర్శించారు. 'ఆరోగ్య నిరక్షరాస్యురాలు' (హెల్త్ ఇల్లిటరేట్) అని కూడా కామెంట్ చేసాడు. సమంత కూడా సుదీర్ఘ పోస్ట్‌లో అతడి పదునైన విమర్శలకు ధీటుగా ప్రతిస్పందించడమే గాక.. మర్యాదగా ఉండమని తనదైన శైలిలో సీరియస్ గా కోరింది.
ఇప్పుడు ఒక సుదీర్ఘ నోట్‌లో ది లివర్ డాక్ సమంతకు క్షమాపణలు చెప్పారు. ''ఆమె వైద్యులపై విమర్శలు చేసింది. వారి చికిత్సలు ఏవీ ప్రభావవంతంగా లేదా ప్రయోజనకరంగా లేవని .. నివారణ ఔషధానికి దగ్గరగా ఉండవని ..ఇది భారీ కుంభకోణం అనే ఉద్ధేశంలో రాసారు. డబ్బు నష్టం.. విపరీతమైన సందర్భాలలో ప్రాణనష్టం అని సమంత అన్నారని అతడు పేర్కొన్నాడు.
తన సుదీర్ఘ పోస్ట్‌లోని ఒక భాగంలో 'ది లివర్ డాక్' ఇలా వ్యాఖ్యానించారు. ''సమంత ఆరోగ్య పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. సానుభూతి చూపిస్తున్నాను. నేను ఆమె ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను సందేశం అందించిన విధానం ఆమెకు అసౌకర్యంగా లేదా చెడుగా అనిపిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. నా లక్ష్యం ఆమె వైద్యపరమైన తప్పుడు సమాచారాన్ని ప్రజలకు షేర్ చేయడం... స్వీయానుభవాలను స్వలాభం కోసం అందించడం వంటి వాటిని సరికాదని మాత్రమే నేను సూచిస్తున్నాను అని రాసారు.
ఇంతకు ముందు సమంత వ్యాఖ్యలు:
డాక్టర్ పిలిప్ పదునైన విమర్శలపై సమంత స్పందిస్తూ.. అతడు సానుభూతితో ఉండవచ్చు.. కానీ అతడు అలా లేడు. ఆయన అలా మాటలు జారకపోయి ఉంటే.. తనపై దయ కరుణ ఉండేది. ముఖ్యంగా అతడు నన్ను జైలులో వేయాలని సూచించాడు... పర్వాలేదు.. ఇది సెలబ్రిటీలకు తప్పదని నేను అనుకుంటాను. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్యం అవసరమైన వ్యక్తిగా ఈ విషయాన్ని పోస్ట్ చేసాను'' అని సమంత రాశారు. సమంత వర్సెస్ డా.పిలిప్ వార్ కొద్దిరోజులుగా చర్చనీయాంశమైంది. చివరికి అతడు సారీ చెప్పాడు గనుక సామ్ క్షమించేస్తారేమో చూడాలి.