'అథర్వ' సింగిల్ షాట్ స్నీక్ పీక్.. ఇదేదో కొత్తగా ఉందే..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
By: Tupaki Desk | 28 Nov 2023 9:47 AM GMTక్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'అథర్వ'. క్రైమ్ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై మరింత ఆసక్తి కలిగించేలా ఓ స్నీక్ పీక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ స్నీక్ పీక్ ను సింగిల్ షాట్ లో తీసినట్లు తెలియజేశారు. ఇక ఈ సింగిల్ షాట్ లో తీసిన స్నీక్ పీక్ ని గమనిస్తే..
ఓ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తుల హత్య జరుగుతుంది. ఈ క్రమంలో క్లూస్ టీం వచ్చి క్లూస్ కలెక్ట్ చేసే పనిలో ఉంటుంది. ఇది క్లూస్ టీమ్ లోనే హీరో, హీరోయిన్లు ఉంటారు. ఆ క్లూస్ ని ఎలా కలెక్ట్ చేస్తారో ఎంతో డీటెయిల్ గా ఇందులో చూపించారు. క్లూస్ కలెక్ట్ చేసే పనిలో టీం ఉంటే పోలీసు వచ్చి తన డ్యూటీ తాను చేసుకుంటాడు. అనంతరం ఈ హత్యల గురించి మీడియాకు సమాచారాన్ని అందిస్తాడు.
సుమారు మూడు నిమిషాలు నిడిమి ఉన్న ఈ సన్నివేశాన్ని సింగిల్ షాట్ లో తీయడం విశేషం. ఇక స్నీక్ పీక్ లో చూపించిన దాని ప్రకారం ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసింది ఎవరు? వీటి వెనకాల ఉన్నది ఎవరు? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా రిలీజ్ చేసిన స్నీక్ పీక్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. దీనికంటే ముందు ఈ సినిమా నుంచి ఓ పాటని విడుదల చేశారు మూవీ యూనిట్. 'కెసీపీడీ' అంటూ సాగే ఈ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణం లో ఎంతో సహజంగా ఈ పాటను చిత్రీకరించారు. పాటలో హీరో కార్తీక్ రాజు తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.