కె.ఎల్.రాహుల్ భార్య ఆతియా బేబి బంప్
కేవలం స్పెషల్ ఫోటోషూట్ ద్వారా మాత్రమే బేబి బంప్ ని పరిచయం చేయాలనుకోవడం ఇటీవల ట్రెండ్ గా మారింది.
By: Tupaki Desk | 30 Dec 2024 3:30 PM GMTచాలా మంది సెలబ్రిటీలు తమ బేబి బంప్ ని పబ్లిక్ లో దాచి ఉంచేందుకు చాలా తాపత్రాయ పడతారు. కేవలం స్పెషల్ ఫోటోషూట్ ద్వారా మాత్రమే బేబి బంప్ ని పరిచయం చేయాలనుకోవడం ఇటీవల ట్రెండ్ గా మారింది. బాలీవుడ్ కథానాయికలు అనుష్క శర్మ, దీపిక పదుకొనే, సమీరా రెడ్డి, కాజల్ అగర్వాల్, రాధిక ఆప్టే... ఇలా భామలంతా తమ ప్రసూతి ఫోటోషూట్ లతో అభిమానుల ముందుకు వచ్చారు.
కానీ ఇప్పుడు నటుడు సునీల్ శెట్టి కుమార్తె, క్రికెటర్ కే.ఎల్.రాహుల్ భార్య ఆతియా శెట్టి తన బేబి బంప్ ని అప్రయత్నంగా ప్రదర్శించింది. ఆతియా శెట్టి ఆస్ట్రేలియాలో అనుష్క శర్మతో కలిసి బేబీ బంప్‌ను ఓపెన్ గా ప్రదర్శించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అతియా శెట్టి - కె.ఎల్ రాహుల్ దంపతులు త్వరలో పేరెంట్‌హుడ్‌ను స్వీకరించబోతున్నట్లు ప్రకటించారు. రెండు చిన్న పాదాల ఫోటోని షేర్ చేసి 2025లో మా అందమైన ఆశీర్వాదం రాబోతోంది! అనే పోస్ట్‌ను షేర్ చేశారు. ఇంతలోనే ఇప్పుడు ఆతియా ఆస్ట్రేలియాలో కనిపించడంతో అభిమానులు బేబీ బంప్‌ను చూడగలిగారు. ఆతియా శెట్టి, అనుష్క శర్మల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ల సమయంలో తమ భర్తలు కె.ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి మద్దతుగా భార్యామణులు ఆస్ట్రేలియాలో ఉన్నారు.
ఆతియా శెట్టి - అనుష్క శర్మ మెల్బోర్న్ స్టేడియం నుండి నిష్క్రమించే సమయంలో వారి వీడియోలను క్యాచ్ చేసిన అభిమానులు వాటిని జోరుగా వైరల్ చేస్తున్నారు. అతియా శెట్టి కంటే ముందు నడుస్తున్న అనుష్క శర్మ తెల్లటి షర్ట్ - జీన్స్ ధరించి కనిపించింది. అథియా స్ట్రిప్డ్ టాప్ డెనిమ్ స్కర్ట్ ధరించి కనిపించింది. కాబోయే మామ్ ఆథియా వేగంగా నడుస్తూ ముందుకు సాగుతోంది. అతియా శెట్టి -కెఎల్ రాహుల్ 2023లో పెళ్లి చేసుకున్నారు. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో వివాహం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ వేడుకగా సాగగా, బాలీవుడ్ నుండి అతికొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. తర్వాత పరిశ్రమ కోసం ముంబైలో భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేసారు.