బేబి బంప్ సరే.. స్టార్ డాటర్ ఫ్యాషన్ సెన్స్ ఔరా!
ఇప్పుడు తల్లి కాబోయే ముందు కడుపులో పెరుగుతున్న బేబీ దృశ్యాన్ని చూపించే అరుదైన అందమైన ఫోటోలను ఆథియా షేర్ చేసింది.
By: Tupaki Desk | 29 Jan 2025 5:58 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కె.ఎల్.రాహుల్ ప్రేమవివాహం గురించి తెలిసిందే. ఈ జంట అన్యోన్యత యువ జంటలకు గొప్ప స్ఫూర్తి. 2024 నవంబర్ లో ఆథియా తన గర్భధారణ గురించి సోషల్ మీడియాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత వీలున్న ప్రతిసారీ ప్రసూతి ఫ్యాషన్ వైబ్స్ గురించి ఆథియా రివీల్ చేస్తూనే ఉంది. గర్భధారణ సమయంలో సౌకర్యంతో పాటు, హై ఫ్యాషన్ సెన్స్ గురించి ఆథియా డీటెయిలింగ్ ఇచ్చింది. తద్వారా తనలోని ఫ్యాషనిస్టా కనుమరుగవ్వలేదని నిరూపించింది ఈ భామ. ఇప్పుడు తల్లి కాబోయే ముందు కడుపులో పెరుగుతున్న బేబీ దృశ్యాన్ని చూపించే అరుదైన అందమైన ఫోటోలను ఆథియా షేర్ చేసింది.
ఒక సౌకర్యవంతమైన డిజైనర్ డ్రెస్‌లో అథియా క్లాసీగా కనిపిస్తోంది. పొడవాటి స్లీవ్స్ .. నల్లని నిట్ టాప్ -సెమీ-షీర్ వైట్ స్కర్ట్ లో బేబి బంప్ ని ఈ అందాల నటి మరింత బ్యూటిఫుల్ గా ఆవిష్కరించింది. ఆథియా త్వరలోనే తల్లి కాబోతోంది. కాబోయే తల్లి ఎంతో గొప్ప అనుభూతులను తన సొంతం చేసుకుంటోంది. మునుపెన్నడూ లేనంత ఆనందం, వైబ్స్ ఆ ముఖంలో మరింత గ్లోని పెంచాయని చెప్పాలి.
ముఖ్యంగా ఆథియా గర్భధారణ ఫ్యాషన్ సెన్స్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఎంపిక చేసుకున్న డ్రెస్ కి తగ్గట్టే, చెవికి ధరించిన స్పెషల్ బ్లింగ్ చెవి పోగులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇవి మేఘనా పెబుల్ షోల్డర్ డస్టర్స్ బ్రాండ్ నుంచి రూ.10,000 రేంజులో లభిస్తాయి. ఈ బంగారు రంగు చెవిపోగులు ఫ్రేమ్‌ను మరింత డిజైనర్ లుక్ లోకి మార్చాయని చెప్పాలి. ఇతర బరువైన ఆభరణాలేవీ ధరించకుండా సింపుల్ గా స్టైలిష్ గా కనిపించింది ఆథియా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆతియా వీలున్న ప్రతిసారీ కె.ఎల్.రాహుల్ ప్రదర్శనను వీక్షించేందుకు క్రికెట్ స్టేడియంలకు విచ్చేసి అక్కడే ఎక్కువ సమయం గడిపింది.