కూతురుకి పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు...!
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి గత ఏడాది తన కూతురు అతియా శెట్టి వివాహం చేసిన విషయం తెల్సిందే
By: Tupaki Desk | 23 Jan 2024 2:16 PM GMTబాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి గత ఏడాది తన కూతురు అతియా శెట్టి వివాహం చేసిన విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకున్న అతియా శెట్టి మరియు క్రికెటర్ కేఎల్ రాహుల్ ల యొక్క వివాహం గత ఏడాది జనవరి ఇదే తేదీన అంటే 23వ తారీకున జరిగిన విషయం తెల్సిందే.
నేడు అతియా - కేఎల్ రాహుల్ యొక్క మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వారికి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందాయి. అయితే వారిద్దరికి అత్యంత ప్రత్యేకమైన శుభాకాంక్షలను సునీల్ శెట్టి అందించడం జరిగింది.
సునీల్ శెట్టి తన సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో తన కూతురు మరియు అల్లుడు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి మొదటి వార్షికోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు అన్నట్లుగా కామెంట్ పెట్టాడు. సునీల్ శెట్టి షేర్ చేసిన ఫోటో మరియు తన కూతురు పట్ల ఆయనకు ఉన్న మమకారం కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
తండ్రి చెప్పిన శుభాకాంక్షలకు అతియా శెట్టి వెంటనే స్పందించింది. తన తండ్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ లవ్ యు డాడీ అన్నట్లుగా కామెంట్ చేసింది. వీరిద్దరి పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు యొక్క వార్షికోత్సవం సందర్భంగా సునీల్ శెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం అందరిని కట్టిపడేస్తోంది.
నటుడిగా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్న సునీల్ శెట్టి తన పిల్లల పట్ల ఎంతో మమకారంతో ఉంటారు అని ఈ పోస్ట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత మంది సెలబ్రెటీలు తమ పిల్లలకు ఇలాంటి శుభాకాంక్షలు చెప్పారు చెప్పండి..!