Begin typing your search above and press return to search.

అట్లీ మల్టీస్టారర్.. సెట్టయితే బీభత్సమే..

కానీ రెమ్యునరేషన్ బడ్జెట్ కారణాల వలన నిర్మాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మరొక టాక్ వచ్చింది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 1:30 AM GMT
అట్లీ మల్టీస్టారర్.. సెట్టయితే బీభత్సమే..
X

జవాన్ సినిమాతో తన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన అట్లీ, తన తదుపరి చిత్రంలో మరో పెద్ద ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలైతే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. నిజానికి అల్లు అరవింద్ ప్రొడక్షన్ లోనే ఈ కాంబినేషన్లో సినిమా రావాల్సింది. కానీ రెమ్యునరేషన్ బడ్జెట్ కారణాల వలన నిర్మాత గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మరొక టాక్ వచ్చింది.

ఏదేమైనా అట్లీ టాలీవుడ్ హీరోతో సినిమా క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ తో సరికొత్త కాంబినేషన్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే అట్లీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో సల్మాన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.

అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ మేటర్ ఏంటంటే, అట్లీ తన డ్యూయల్ హీరో ప్రాజెక్ట్ కోసం యూనివర్శల్ హీరో కమల్ హాసన్‌ని సెకండ్ హీరోగా తీసుకోవడానికి ఫైనల్ టాక్స్ లో ఉన్నట్లు టాక్. రెండు ఇండస్ట్రీల లెజెండ్స్‌ని ఒకే స్క్రీన్ మీద చూడడం ప్రేక్షకులకు పెద్ద ట్రీట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన పాన్-ఇండియా రీయూనియన్ కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం అందించేది అనిరుద్ అని తెలుస్తోంది. తన ప్రత్యేకమైన మ్యూజిక్ స్టయిల్‌తో అనిరుద్ సంగీతం ఈ సినిమాకి మరింత బజ్ తీసుకురావడం ఖాయం.

అట్లీ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. షారుక్ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీ భారీ విజయం సాధించడం, అతని మార్క్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్స్‌ను ఒకే సినిమాలో చూడటం ఎంతటి క్రేజీ కాంబినేషన్ అవుతుందో ఊహించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్ కోసం అట్లీ చాలా జాగ్రత్తగా పని చేస్తున్నాడు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగ భరితమైన కథతో రాబోతోందని చెబుతున్నారు. మరి, ఈ డ్యూయల్ హీరో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి