స్టార్ డైరెక్టర్ మూవీ.. అదంతా ఉత్తుత్తి ప్రచారమేనా?
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ ఓ చిత్రాన్ని రూపొందిస్తారని, రజనీ కానీ, కమల్ హాసన్ కానీ చిత్రంలో నటించే వీలుందని కూడా గుసగుసలు వినిపించాయి.
By: Tupaki Desk | 2 Feb 2025 3:00 AM GMTఇటీవలే బేబిజాన్ చిత్రంతో బాలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెట్టాడు అట్లీ. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ పర్యవేక్షణలో తెరకెక్కినా కానీ ఫ్లాపైంది అన్న ముద్ర అతిడికి కంటిమీద కునుకుపట్టనివ్వని వ్యవహారంగా మారింది.
ఇంతలోనే అట్లీ తెరకెక్కించే తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ ఓ చిత్రాన్ని రూపొందిస్తారని, రజనీ కానీ, కమల్ హాసన్ కానీ చిత్రంలో నటించే వీలుందని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఇవేవీ నిజాలు కాదు. కేవలం పుకార్లు మాత్రమే.
తాజా సమాచారం మేరకు.. అట్లీతో సల్మాన్ సినిమా చేస్తారు. కానీ అందులో ఇతర పెద్ద హీరోలు ఎవరూ ఖరారు కాలేదు. ఈ చిత్రం ప్రస్తుతం రచన దశలో ఉంది. ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. ఈ ఏడాది మిడిల్ లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే బేబి జాన్ ఫలితం కారణంగా అట్లీ ఆచితూచి అడుగులేస్తున్నాడని తెలుస్తోంది. షారూఖ్ కోసం 'జవాన్' లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అట్లీ.. సల్మాన్ కి కూడా అలాంటి ఒక విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రకరకాల గాసిప్పులు షికార్ చేస్తున్నాయి.