ఆ ఇద్దరితో అట్లీ భారీ మల్టీస్టారర్?
జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో దేశం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అట్లీ.
By: Tupaki Desk | 28 Jan 2025 5:20 AM GMTప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తోంది. హీరోలు కూడా మల్టీస్టారర్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ రూపంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించారో అందరం చూశాం. ప్రస్తుతం తారక్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్2 సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో దేశం మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అట్లీ. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అట్లీ తర్వాత ఎవరితో చేస్తాడని అందరూ ఎదురుచూసేలా జవాన్ తో మెప్పించాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో షారుఖ్ తోనే మరో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.
కానీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంతో అట్లీ ఇప్పుడో మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ మల్టీస్టారర్ లో కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతున్నదో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ నెలకొనడం ఖాయం.
అయితే గతంలో అట్లీ ఓ ఇంటర్య్వూలో తన తర్వాతి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తాను ఆ స్క్రిప్ట్ వర్క్స్ లోనే బిజీగా ఉన్నానని, ఆ సినిమాలో స్టార్లను చూసి అంతా ఆశ్చర్యపోతారని, సినిమా అవుటాఫ్ ది వరల్డ్ ఐడియాతో రూపొందనుందని ఊరించాడు అట్లీ.
దీంతో అప్పుడు అట్లీ చెప్పిన మల్టీస్టారర్ ఇదేనని ఇప్పుడు వార్తలు ఊపందుకుంటున్నాయి. చూస్తుంటే అట్లీ ఈ మల్టీస్టారర్ ను నెక్ట్స్ లెవెల్ లోనే ప్లాన్ చేసినట్టు కనిపిస్తున్నాడు. అట్లీ రీసెంట్ గా తను తీసిన తేరీ సినిమాను బాలీవుడ్ లోకి బేబీ జాన్ పేరుతో నిర్మాతగా రీమేక్ చేయించి రిలీజ్ చేశాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది.
ఇక రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తుండగా, అది పూర్తవగానే నెల్సన్ తో జైలర్2 ను పూర్తి చేయాల్సి ఉంది. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ తో సికిందర్ సినిమాను చేస్తున్నాడు. అట్లీ మల్టీస్టారర్ వార్త నిజమైతే రజనీకాంత్, సల్మాన్ ఖాన్ తమ కమిట్‌మెంట్స్ ను పూర్తి చేసుకున్న వెంటనే ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది.