Begin typing your search above and press return to search.

అట్లీ-స‌ల్మాన్ మూవీలో కమల్ స్థానంలో ర‌జ‌నీ?

అయితే ఇప్పుడు క‌మ‌ల్ స్థానంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 12:30 AM GMT
అట్లీ-స‌ల్మాన్ మూవీలో కమల్ స్థానంలో ర‌జ‌నీ?
X

దర్శకుడు అట్లీ మెగా-యాక్షన్ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్ తో పాటు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇప్పుడు క‌మ‌ల్ స్థానంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. నటీనటుల్లో మార్పు రావచ్చని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టవచ్చనే పుకారు బ‌లంగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

అట్లీ భారీ యాక్ష‌న్ మూవీ గురించి మొదట జూలైలో టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇది పాన్-ఇండియన్ కేట‌గిరీలో తెర‌కెక్క‌నుంది. ప్రాజెక్ట్ ఎట్టకేలకు ట్రాక్‌లో ఉందని అక్టోబర్ 2024 నాటికి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, జనవరి 2025లో షూటింగ్ ప్రారంభమవుతుందని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే రజనీకాంత్‌, ఖాన్‌లు ప్ర‌స్తుతానికి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ త‌దుప‌రి వేట్టయాన్ విడుదల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాలో మ‌రోసారి ర‌జ‌నీ కాప్ అవ‌తార్ లో క‌నిపిస్తారు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి వంటి అగ్ర‌ నటులు ఇందులో న‌టించారు. మరోవైపు స‌ల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ , టైగర్ v/s పఠాన్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అయితే అట్లీతో ఎప్ప‌టి నుంచి వీరు అందుబాటులోకి వ‌స్తారు? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.