Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ వైఫ్ నెట్టింట హాట్ ట్రీట్!

డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దైన మార్క్ గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 7:21 AM GMT
డైరెక్ట‌ర్ వైఫ్ నెట్టింట హాట్ ట్రీట్!
X

సోష‌ల్ మీడియాలో అట్లీ వైఫ్ ప్రియ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లైన త‌ర్వాత సినిమాల‌కైతే దూర‌మైంది కానీ! అభిమానుల‌కు కాద‌ని చాలాసార్లు ప్రూవ్ చేసింది. ఈ మ‌ధ్య కాలంలో ప్రియ హాట్ సెన్షేష‌న్ గురించైతే చెప్పాల్సిన ప‌నేలేదు. హీరోయిన్ కి ఏమాత్రం త‌క్కువ కాదంటూ గ్లామ‌ర్ షోతో దూసుకుపోతుంది. కొత్త కొత్త ఫోటో షూట్ల‌తో అద‌ర‌గొడుతుంది. డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దైన మార్క్ గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంటుంది.


తాజాగా ప్రియ‌కృష్ణ నుంచి మ‌రో హాట్ ఫోటో వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ అండ్ రెండ్ కాంబినేష‌న్ గౌనులో త‌ళుక్కున మెరిసింది. ప్రియ హియ‌ర్ రింగ్స్, అలంక‌ర‌ణ ప్ర‌తీది ఎంతో అందంగా తీర్చిదిద్దాయి. క‌ళ్ల‌లో భావాలు..పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు మరింత అందంగా హైలైట్ చేస్తున్నాయి. ఓ బిడ్డ‌కు త‌ల్లైనా అందంలో ఇసు మెత్తు మార్పు కూడా రాలేద‌ని ప్రూవ్ చేసిన మ‌రో పిక్ ఇది. అట్లీ-ప్రియ జోడీ రొమాంటిక్ క‌పుల్ గానూ అంతే హైలైట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.


ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే వెళ్తారు. క‌లిసే ఫోటోలిస్తారు. ఆ స‌మ‌యంలో ఎంతో రొమాంటిక్ గాను హైలైట్ అవుతుంటారు. అందులోనూ ప్రియ‌కృష్ణ డ్రెస్సింగ్ సెన్స్ మ‌రింత ఇంట్రెస్టింగ్ గానే ఫోక‌స్ అవుతుంటుంది. ఆ ర‌కంగ చూస్తే కోలీవుడ్ లో ఈ జోడీ సంథింగ్ స్పెష‌ల్ అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌లెన్నో ఉన్నాయి. కానీ ఈ జోడీ మాత్రం కెమెరాలో డిఫ‌రెంట్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ప్ర‌స్తుతం తాజా పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది.


ప్రియ ఫాలోవ‌ర్లు ఆమె లో బ్యూటీని ఉద్దేశించి ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. వివాహం త‌ర్వాత మాత్రం సినిమాల‌కి దూర‌మైంది. సినిమాలు చేస్తే న‌టిగా ఇంకా మంచి స్థాయికి చేరేదంటూ అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు అభిప్రాయ‌ ప‌డుతుంటారు. కానీ ఆమె కుటుంబ జీవితాన్నే కోరుకుంది. సింగం, రాజా రాణి, నా పేరు శివ, తేరి లాంటి చిత్రాల్లో నటించిన సంగ‌తి తెలిసిందే.