Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో పూల‌రంగ‌డిలా దిగాడు

రెండు ప్రీవెడ్డింగులు ముగిశాక ఇటీవ‌ల అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు ముంబైలో విలాసవంతమైన సంగీత్ వేడుకతో ప్రారంభమయ్యాయి

By:  Tupaki Desk   |   8 July 2024 4:44 AM GMT
అంబానీ పెళ్లిలో పూల‌రంగ‌డిలా దిగాడు
X

రెండు ప్రీవెడ్డింగులు ముగిశాక ఇటీవ‌ల అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలు ముంబైలో విలాసవంతమైన సంగీత్ వేడుకతో ప్రారంభమయ్యాయి. జూలై 12 ఈ జంట పెళ్లి జ‌ర‌గ‌నుంది. పెళ్లి సంబ‌రాలు జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్ కి కొత్త క‌ళ‌ను తెచ్చాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి మెరుపులు అన‌ద‌గ్గ ప్ర‌ముఖులు ఈ పెళ్లిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు. ఈ ఐదు రోజుల‌ పెళ్లికి బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా విచ్చేస్తున్నారు.

ఇప్ప‌టికే సంగీత్‌కి హాజరైన అనేక మంది ప్రముఖులలో సౌతిండియ‌న్ దర్శకుడు అట్లీ ఆయ‌న‌ భార్య కృష్ణ ప్రియ ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక కోసం అట్లీ, అత‌డి భార్య ప్రియా ఎంపిక చేసుకున్న దుస్తులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. ఎరుపు రంగు పూలు, ప‌చ్చని ఆకుల‌తో డిజైన్ చేసిన షేర్వాణీలో అట్లీ పూల‌రంగ‌డినే త‌ల‌పించాడు. చేతికి రాగి క‌డియం తాయ‌త్తుతో అత‌డు మాసీగా క‌నిపించాడు. అట్లీ భార్య ప్రియా కాంబినేష‌న్ పూల డిజైన్‌తో ఉన్న లెహంగా- బ్లేజ‌ర్‌లో అందంగా కనిపించారు. వేదిక వ‌ద్ద క‌ళ్ల‌న్నీ ఈ జంట‌పైనే వాలిపోయేంత స్పెష‌ల్‌గా యూనిక్ డ్రెస్‌లో వారు క‌నిపించారు.

ముఖ్యంగా షారూఖ్ కి జ‌వాన్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన అట్లీకి బాలీవుడ్ లో ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ఖాన్ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ప‌ఠాన్ తో ఆదుకోగా, ఆ స‌క్సెస్ స్ట్రీక్ కి కొన‌సాగింపుగా జ‌వాన్ లాంటి మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించాడు అట్లీ. అందుకే అత‌డికి ప్ర‌త్యేకించి గౌర‌వం ద‌క్కుతోంది. త‌దుప‌రి అట్లీ బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమాని రూపొందించే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అంబానీల పెళ్లిలో అట్లీ గౌర‌వం అందుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సౌత్ నుంచి స్టార్లు ఎవ‌రూ ఈ పెళ్లిలో ఇంకా క‌నిపించ‌లేదు. కానీ అట్లీ మాత్రం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారాడు. భార్య ప్రియాతో క‌లిసి అట్లీ ఆసియ‌న్ నం.1 ధ‌న‌వంతుడి ఇంట‌ పెళ్లి వేడుక‌ల‌కు అటెండ‌వుతూ సంద‌డిగా క‌నిపిస్తున్నాడు.

అంబానీ సంగీత్‌లో స‌ల్మాన్ ఖాన్, ర‌ణ‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, MS ధోని, రణబీర్ కపూర్, అలియా భట్ త‌దిత‌రులు క‌నిపించారు. బాలీవుడ్ నుంచి టాప్ సెల‌బ్రిటీలంతా ఈ పెళ్లిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అట్లీ త‌దుప‌రి సల్మాన్ ఖాన్ - కమల్ హాసన్ కాంబినేష‌న్‌లో మెగా-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ని తెర‌కెక్కించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో పాటు అట్లీ తన త‌దుప‌రి హిందీ చిత్రం 'బేబీ జాన్' చిత్రీక‌ర‌ణ‌ కోసం కూడా సిద్ధమవుతున్నాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్, సన్యా మల్హోత్రా వంటి అద్భుతమైన తారాగణం న‌టిస్తున్నారు.