Begin typing your search above and press return to search.

బోయ్ ప్రెండ్ తో జాన్వీ మ‌ధ్య‌లో అట్లీ ఫ్యామిలీ

తాజాగా ఈ జోడీ ఉజ్జ‌యినిలోని ప్ర‌సిద్ద మహాకాళేశ్వర జ్యోతిర్లింగం శైవ క్షేత్రంలో ప్ర‌త్య‌క్ష‌మ్యారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 1:04 PM GMT
బోయ్ ప్రెండ్ తో జాన్వీ మ‌ధ్య‌లో అట్లీ ఫ్యామిలీ
X

జాన్వీక‌పూర్- శిఖ‌ర్ ప‌హారియా మ‌ధ్య సీరియ‌స్ రిలేష‌న్ షిప్ న‌డుస్తోంద‌ని చాలా కాలంగా ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలెన్నో. కానీ ఏనాడు ఆ రిలేష‌న్ షిప్ గురించి స్పందిం చింది లేదు. స్పంద‌న లేక‌పోయినా ఇద్ద‌రు వ్య‌వ‌హార శైలి మాత్రం స్నేహాన్ని మించే క‌నిపిస్తుం ద‌ని బాలీవుడ్ మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు హీటెక్కిస్తూనే ఉంది. తాజాగా ఈ జోడీ ఉజ్జ‌యినిలోని ప్ర‌సిద్ద మహాకాళేశ్వర జ్యోతిర్లింగం శైవ క్షేత్రంలో ప్ర‌త్య‌క్ష‌మ్యారు.

ఇద్ద‌రు భ‌జ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జాన్వీ..శిఖ‌ర్ ప‌క్క ప‌క్క‌నే కూర్చుని చేతుల‌తో భ‌జ‌న చేస్తూ స్వామి వారి సేవ‌లో పునీత‌ల‌వుతున్నారు. వాళ్లిద్ద‌రితో పాటు ద‌ర్శ‌కుడు అట్లీ కూడా స‌తీస‌మేతంగా భ‌జ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. గుడులు గోపురాలు చుట్టేయ‌డంలో జాన్వీ..శిఖ‌ర్ జోడీ సంథింగ్ స్పెష‌ల్ గా నే క‌నిపిస్తున్నారు. ఇలా జంట‌గా దేవుడు గుళ్ల‌కు హాజ‌ర‌వ్వ‌డం కొత్తేం కాదు.

గ‌తంలో జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని బోయ్ ఫ్రెండ్ తోనే దర్శించుకుంది. అంత‌కు ముందు కొన్ని ప్ర‌త్యేక దేవాల‌యాల‌కు వెళ్లారు. ఇద్ద‌రు మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ అయింది కూడా ఇలాంటి వీడియో లు..ఫోటోల‌తోనే. వాళ్లిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఉంద‌న్న విష‌యం కూడా వాటి ద్వారా నే ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. రొమాంటిక్ గా క‌నిపించిన సంద‌ర్బాలు కూడా చాలా రేర్ అనే చెప్పాలి.

ఏది ఏమైనా జాన్వీ కొత్త బోయ్ ప్రెండ్ తో ఇలా టెంపుల్స్ కి వెళ్ల‌డం తో ఆమె ఎంతటి భ‌క్తురాలు అన్న విష‌యం అర్ధ‌మ‌వుతుంది. ఆ జోడీతో పాటు అట్లీ దంప‌తులు కూడా వెళ్ల‌డం స‌ర్ ప్రైజ్ అనాలి. మ‌రి వాళ్లిద్ద‌రితో అట్లీ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలి. ఇప్ప‌టికే అట్లీ `జ‌వాన్` తో బాలీవుడ్ ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షారుక్-విజ‌య్ తో భారీ మ‌ల్టీస్టార‌ర్ కి స్టోరీ సిద్దం చేస్తున్నాడు.