Begin typing your search above and press return to search.

కల్కి... అట్లీ నుంచి ఊహించని పోస్ట్‌

తాజాగా తమిళ స్టార్‌ దర్శకుడు, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్ సినిమాను రూపొందించి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన అట్లీ కూడా కల్కి గురించి స్పందించాడు.

By:  Tupaki Desk   |   30 May 2024 5:30 AM GMT
కల్కి... అట్లీ నుంచి ఊహించని పోస్ట్‌
X

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందిన కల్కి 2898 AD సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపించే విధంగా కల్కి ఉండబోతుంది అంటూ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల సినీ ప్రముఖులు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు.

ఇప్పటికే కల్కి గురించి ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. కల్కి కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్‌ దర్శకుడు, బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తో జవాన్ సినిమాను రూపొందించి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన అట్లీ కూడా కల్కి గురించి స్పందించాడు.

కల్కి టీంలో ఏ ఒక్కరితో కూడా అట్లీకి పెద్దగా పరిచయం లేదు. కల్కి సినిమా గురించి ఆయనే స్వయంగా స్పందించాడు. కల్కి యొక్క బుజ్జీ వీడియో మరియు ప్రత్యేకమైన కార్‌ ఇంకా ఇతర ప్రమోషనల్‌ స్టఫ్‌ చూసిన తర్వాత దర్శకుడు అట్లీ కి కూడా ఆసక్తి పెరిగినట్లుగా ఉంది.

అందుకే సోషల్‌ మీడియా ద్వారా... సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కాబోతున్న నేపథ్యంలో టీమ్ మొత్తంకు ముందస్తుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు. అట్లీ నుంచి వచ్చిన ఈ ఊహించని పోస్ట్‌ కు కల్కి టీమ్‌ మెంబర్స్ అంతా కూడా హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు.

కల్కి సినిమాను జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. రూ.700 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్‌, దుల్కర్ సల్మాన్‌, నాని, దీపికా పదుకునే, దిశా పటానీ ఇంకా ఎంతో మంది ప్రముఖులు నటించారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్ గా కల్కి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.