Begin typing your search above and press return to search.

సేనాప‌తిపై రాళ్లు..క‌ర్ర‌ల‌తో దాడి!

వాళ్లంతా రాళ్లు..ర‌ప్ప‌ల‌తో మీద‌కొస్తుంటే? సేనాప‌తి మాత్రం చేతుల‌తోనే పోర‌టాం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 9:59 AM GMT
సేనాప‌తిపై రాళ్లు..క‌ర్ర‌ల‌తో దాడి!
X

క‌మ‌ల్ హాస‌న్ అలియాస్ సేనాప‌తి పై క‌ర్ర‌లు...రాళ్ల‌తో దాడి. సేనాప‌తిని తుదిముట్టించాల‌నే సంక‌ల్పంతా శ‌త్రుమూక‌లంతా ఏక‌మ‌య్యారు. వాళ్ల దాడిని సేనాపతి అదే తీరున తిప్పుకొడుతున్నాడు. వాళ్లంతా రాళ్లు..ర‌ప్ప‌ల‌తో మీద‌కొస్తుంటే? సేనాప‌తి మాత్రం చేతుల‌తోనే పోర‌టాం చేస్తున్నాడు. అవును ఇప్పుడీ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని విజ‌య‌వాడ‌లో ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రీక‌రిస్తున్నాడు.

నాలుగు రోజులుగా సినిమా షూటింగ్ విజ‌య‌వాడ‌లో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా స్పాట్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈస‌న్నివేశాల కోసం శంక‌ర్ భారీ ఎత్తున జ‌నాల్ని షూటింగ్ స్పాట్ కి తీసుకొస్తున్నారు. చుట్టూ భారీగా జ‌నాలు..హ‌డావుడి లొకేష‌న్ లో చిత్రీక‌రిం చాల్సిన స‌న్నివేశాలు కావ‌డంతో జ‌నాల త‌ర‌లింపు త‌ప్ప‌డం లేదు. శుక్ర‌వారం ఒక్క‌రోజు క‌మ‌ల్ పై అత్యంత కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక సేనాప‌తి లుక్ లో క‌మ‌ల్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నారు. పండిన ముస‌లి గెట‌ప్..దానికి త‌గ్గ‌ట్టు కాస్ట్యూమ్స్ ప్ర‌తీది హైలైట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. షూటింగ్ చూడ‌టానికి స్థానికులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. ఆ విజువ‌ల్స్ క్యాప్చ‌ర్ చేస్తున్నారు. సినిమాలో అవ‌స‌రం మేర వాటిని ఉప‌యోగించే అవ‌కాశం ఉంది.

విజ‌య‌వాడ అనంత‌రం విశాఖ‌ప‌ట్ట‌ణంలో మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే అనుమ‌తులు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే విశాఖ‌లో ఆంధ్రాయూ నివ‌ర్శిటీలో చిత్రీక‌రించే కొన్ని స‌న్నివేశాలున్నాయ‌ని స‌మాచారం. కాలేజ్ నేప‌థ్యంలో తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశాలు కావ‌డంతో యూనివ‌ర్శిటీ నేప‌థ్యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.