సలార్ బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం.. బాద్యులెవరు?
నైజాం ఏరియా హక్కులను కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ కొన్ని సెంటర్లలో ఆఫ్ లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
By: Tupaki Desk | 20 Dec 2023 8:15 AM GMTహై వోల్టేజ్ కాంబినేషన్ మూవీ సలార్ పై అంచనాలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్న విధానం చూస్తూ ఉంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి అనేలా సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. నైజాం ఏరియా హక్కులను కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ కొన్ని సెంటర్లలో ఆఫ్ లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
దీంతో ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొదటి రోజు మొదటి షో చూడాలి అనే విధంగా టికెట్ల కౌంటర్ల వద్ద బారులు తీరిన సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత ఆఫ్ లైన్ టికెట్లకు గట్టి డిమాండ్ అయితే పెరిగింది అని చెప్పవచ్చు. ఒక విధంగా ఆన్ లైన్ చార్జీలను తగ్గించుకునేందుకు మైత్రి నిర్మాతలు ఇలా ఆలోచించారు. అయితే ఇలా చేయడం వల్ల కొంతవరకు డిస్ట్రిబ్యూటర్స్ కు అలాగే ఆడియెన్స్ కు లాభమే అయినప్పటికీ పరిస్థితిని థియేటర్ల యాజమాన్యం అదుపులో పెట్టకపోతే వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది.
రీసెంట్గా కొన్ని మాస్ ధియేటర్లలో ఫ్యాన్స్ ఎగబడిన విధానానికి థియేటర్లో కౌంటర్ వద్ద పోలీసులు లాటిఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు జనాల సంక్షేమం కోసమే ఆ తరహా నిర్ణయం తీసుకున్నప్పటికీ యువకుల అత్యుత్సాహం వలన తొక్కిసలాట జరిగితే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 15 ఏళ్ల క్రితం వరకు థియేటర్లలో ఇలాంటి వాతావరణమే ఎక్కువగా కనిపించేది.
కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆన్లైన్ టికెట్ల కొనుగోలు చేసి ప్రశాంతంగా సినిమాలు చూడడానికి జనాలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ విధంగా ఆఫ్ లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం థియేటర్లో కౌంటర్స్ వద్ద యువకులు ఎగబడుతున్న విధానం చూస్తూ ఉంటే భయాంకరంగా అనిపిస్తోంది.
థియేటర్స్ వద్ద టిక్కెట్లు అమ్మడం మంచి పద్ధతే అయినా అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. థియేటర్స్ యాజమాన్యం కచ్చితంగా క్యూ విషయంలో ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా డబ్బుల కక్కృత్తి కోసం ఈ విధంగా చేస్తారా అని మాట వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విషయంలో కేవలం థియేటర్స్ యాజమాన్యం మాత్రమే కాకుండా ఫ్యాన్స్ ఇష్టంగా కొలిచే హీరోలు, దర్శకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.