Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : మెగా చీఫ్ ఎంపికపై విపరీతమైన ట్రోల్స్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మెగా చీఫ్ గా విష్ణు ప్రియ గెలిచింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 6:04 AM GMT
బిగ్ బాస్ 8 : మెగా చీఫ్ ఎంపికపై విపరీతమైన ట్రోల్స్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మెగా చీఫ్ గా విష్ణు ప్రియ గెలిచింది. చీఫ్ కంటెండర్స్ గా బీబీ రాజ్యం టాస్క్ ఆడిన రాయల్ క్లాన్, ఓజీ క్లాన్స్ నుంచి ఆరుగురు మెగా చీఫ్ ఫైనల్ రేసులో నిలవగా వారిలో విష్ణు ప్రియకు మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ దక్కింది. చీఫ్ కంటెండర్స్ కాకుండా మిగతా హౌస్ మెట్స్ ఆట ఆడి వీరిలో ఎవరిని మెగా చీఫ్ చేయాలని నిర్ణయించాల్సి ఉండగా ఆ టాస్క్ లో విష్ణు ప్రియని చీఫ్ గా చేశారు.

ఐతే హౌస్ లో అసలేమాత్రం టాస్కులు ఆడకుండా కేవలం పృధ్వితో పులిహోర కలుపుతూ కనిపించిన విష్ణు ప్రియ ఎలా మెగా చీఫ్ అవుతుందని ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెగా చీఫ్ అవ్వాలని ప్రేరణ చాలా తాపత్రయ పడుతుంది. అలాంటి టైంలో తన సొంత క్లాన్ మెంబర్స్ కూడా ఆమెకు కాకుండా విష్ణు ప్రియని మెగా చీఫ్ చేశారు. మెగా చీఫ్ గా విష్ణు ప్రియకు అర్హత లేదని డైరెక్ట్ గా ఆడియన్స్ చెప్పేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఆట ఎనిమిది వారాలు ముగియగా ఇప్పటివరకు విష్ణు ప్రియ సీరియస్ గా ఆడిన టాస్క్ ఒక్కటి కూడా లేదు. ఐతే ఇప్పుడు ఆమె మెగా చీఫ్ అయ్యింది ఈ వారం అయినా చీఫ్ గా తన ప్రతిభ చాటాలి. అంతేకాదు నెక్స్ట్ వీక్ ఎలాగు నామినేషన్స్ లో ఉండదు కాబట్టి వారం మొత్తం తన ఎఫర్ట్స్ తో మెప్పించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ ఛాన్స్ మిస్ యూజ్ చేసినట్టే అవుతుంది. ఇంకా మెయిన్ గా మెగా చీఫ్ అయ్యింది కాబట్టి పృధ్వికి ఎలాంటి వర్క్ లేకుండా ఫేవరిజం చూపిస్తే మాత్రం కచ్చితంగా అమ్మడికి ఎఫెక్ట్ పడుతుంది.

ఈ విషయాలన్నిటినీ గమనించి విష్ణు ప్రియ ఈ వీక్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మరోపక్క ప్రేరణ మెగా చీఫ్ కాకపోయినా కూడా ఆమెకు బయట ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇక సంచాలక్ గా నిఖిల్ బయాస్ గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఇది అతనికి టైటిల్ రేసు నుంచి అతన్ని దూరం చేస్తుందని చెప్పొచ్చు. మెగా చీఫ్ గా విష్ణు ప్రియ తన మార్క్ చాటాల్సిన టైం వచ్చింది. ఈ వారం విష్ణు ప్రియకు చాలా కీలకం కానుంది.