Begin typing your search above and press return to search.

ఆకలి మీదున్న ఆడియెన్స్.. GOG టేస్ట్ తగిలిందంటే..

ముఖ్యంగా సమ్మర్ లో సినీ ప్రేక్షకులు ఒక మంచి సాలిడ్ సినిమా కోసం అయితే ప్రతి ఏడాది ఎదురు చూస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   29 May 2024 12:30 PM GMT
ఆకలి మీదున్న ఆడియెన్స్.. GOG టేస్ట్ తగిలిందంటే..
X

ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్నో రకాల సినిమాలో విడుదలయ్యాయి. అయితే ఇందులో సక్సెస్ అయిన సినిమాల సంఖ్య మాత్రం చాలా తక్కువ. దాదాపు 100కు పైగా సినిమాలు విడుదల కాగా అందులో మాస్ ఆడియన్స్ కు నచ్చింది కేవలం రెండు మూడు సినిమాలు. అవి కూడా పూర్తిస్థాయిలో వారి ఆకలిని తీర్చలేకపోయాయి. ముఖ్యంగా సమ్మర్ లో సినీ ప్రేక్షకులు ఒక మంచి సాలిడ్ సినిమా కోసం అయితే ప్రతి ఏడాది ఎదురు చూస్తూ ఉంటారు.

కానీ ఈసారి టాలీవుడ్ ఈ హాలిడేస్ ను పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. ఇక ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ కొరత ఇప్పుడు గట్టిగానే ఉంది. ఈ క్రమంలో ఒక మంచి మాస్ సినిమా పడితే గనక బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మంచి హైప్ అయితే ఉంది. విశ్వక్ సేన్ కృష్ణ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ మాస్ మసాలా మూవీ లో మంచి డ్రామా అలాగే ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి.

కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అసలే ఆకలి మీద ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా టెస్ట్ ఏమాత్రం తగిలినా కూడా మళ్లీ రెండోసారి థియేటర్లోకి వెళ్లి విజిల్స్ వేస్తారు అని చెప్పవచ్చు. ట్రైలర్ తోనే సినిమాలో స్టఫ్ గట్టిగా ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. విశ్వక్ సేన్ పర్ఫెక్ట్ మాస్ రోల్ చేస్తే మామూలుగా ఉండదు అని రెండు మూడు సీన్లతోనే అర్థమయిపోయింది.

కాబట్టి సినిమాలో కావలసిన కంటెంట్ గట్టిగానే ఉంటుంది అనే మేకర్స్ ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇక సినిమా బిగ్ స్క్రీన్ పై హంగామా చేయడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆన్ లైన్ లో సినిమా బుకింగ్స్ ఒక రేంజ్ లో నమోదవుతున్నాయి. విడుదలైన కొన్ని గంటలకే బుక్ మై షో లో కొన్ని సెంటర్లలో ఫుల్ టికెట్స్ అమ్ముడయ్యాయి.

ఇప్పుడు టాలీవుడ్ కు కావాల్సింది కూడా ఇలాంటి మంచి తరుణమే అని చెప్పాలి. మొన్నటి వరకు థియేటర్స్ చాలా డల్ గా నడిచాయి. ఏదైనా ఒక మంచి సినిమా పడితే బాగుంటుంది అని ఎగ్జిబిటర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒకవైపు ఆడియన్స్ కు మంచి కిక్ ఇవ్వడమే కాకుండా మరొకవైపు డిస్ట్రిబ్యూటర్ కి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కేవలం యూత్ కి మాత్రమే కాదు.. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అని ఇటీవల ట్రైలర్ ద్వారా అర్థమైపోయింది. సినిమాలో ఎన్నో మంచి విషయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. కాబట్టి ఇప్పుడు మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.