Begin typing your search above and press return to search.

ఓటీటీ బొమ్మెప్పుడు సామీ అంటున్నారే!

ఆరు వారాల త‌ర్వాత సినిమా ఎలాగూ ఓటీటీ లో రిలీజ్ అవు తుంది క‌దా? అప్పుడ చూద్దాం లే అనే ఆడియ‌న్స్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 12:30 AM GMT
ఓటీటీ బొమ్మెప్పుడు సామీ అంటున్నారే!
X

ఇప్ప‌టికే థియేట‌ర్లు ప్రేక్ష‌కులు లేక‌ వెల వెల‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా జ‌నాల్ని థియేట‌ర్కి ర‌ప్పించాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో ప‌లించ‌డం లేదు. పెంచిన టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం...థియేట‌ర్లోనే ప్ర‌తీ ప్రేక్ష‌కుడు సినిమాని ఆస్వాదించాల‌ని సాధ్య‌మైనంత వ‌ర‌కూ హీరోలు..నిర్మాత‌లు..ద‌ర్శ‌కులు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఓటీటీ ఎఫెక్ట్ థియేట ర్ల‌పై కొంత‌వ‌ర‌కూ ప్రభావం చూపిస్తుంది.

ఆరు వారాల త‌ర్వాత సినిమా ఎలాగూ ఓటీటీ లో రిలీజ్ అవు తుంది క‌దా? అప్పుడ చూద్దాం లే అనే ఆడియ‌న్స్ ఉన్నారు. అంత‌వ‌ర‌కూ ఆగ‌లేని వారంతా థియే ట‌ర్కి వెళ్లి చూస్తారు? మ‌న‌మెందుకు తొంద‌ర ప‌డ‌టం ఎంచ‌క్కా ఓటీటీలో కి వ‌చ్చాక ఫ్యామిలీ అంద‌రికీ ఒకే టికెట్ ఇంట్లో కూర్చుని ఆస్వా దించుచ్చు అనే ఓ అభిప్రాయానికి వ‌చ్చేస్తున్నారు. ఇక అంత‌కు ముందే కొన్ని వైబ్ సైట్ల‌లో సినిమా ప్ర‌త్య‌క్ష మైపో తుంది.

పైర‌సీ రూపంలో హెచ్ డీ ప్రిట్ ఆరు వారాల కంటే ముందుగానే రిలీజ్ అయిపోతుంది. ఆరు వారాలు ఆగ‌లేని ప్రేక్ష‌కులంతా వాటితో స‌రిపెట్టుకుంటున్నారు. థియేట‌ర్ల‌పై ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా ప‌డింది అన డానికి మొన్న‌టి పీవీఆర్ ఐమాక్స్ లు మూత‌ప‌డ‌టం ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. ఇటీవ‌లే దేశ వ్యాప్తంగా 53 కి పైగా పీవీఆర్ లు మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. న‌ష్టాల నుంచి బ‌య‌ట‌కు రావాలంటే వాటిని మూత వేయ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని యాజ‌మాన్యం ఆదిశ‌గా నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా ఓటీటీ ప్ర‌భావం జ‌నాల్లో ఎంత బ‌లంగా ఉంది అన‌డానికి దీన్నొక ఉద‌హార‌ణ‌గా చెప్పొచ్చు. సంక్రాంతి కానుక‌గా `గుంటూరు కారం`..`సైంధ‌వ్`.. `నా సామిరంగ` లాంటి పెద్ద సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు ఓటీటీలోకి అందుబాటులోకి రాని స‌మ‌యంలో థియేట‌ర్ కి వెళ్లి చూద్దామా? అనే డిస్క‌షన్ కొన్ని ఫ్యామీలీల్లో మొద‌లైంది.

ఇంత‌లోనే ఇంకెందుకు ఆ సినిమాలు కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో కి వ‌చ్చేస్తాయి క‌దా? అని థియేట‌ర్ కి వెళ్ల‌కుండా ఆగిపోయిన ప్రేక్ష‌కులు ఎంతో మంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ స‌న్నివేశం అన్ని చోట్లా క‌నిపిస్తుంద‌ని ఇటీవ‌ల ఓప్ర‌ముఖ ఎన‌లిస్ట్ సైతం అభిప్రాయ‌ప‌డ్డారు. థియేట‌ర్లో బొమ్మ కాదు..ఓటీటీలో బొమ్మెప్పుడు? అనే డిస్క‌ష‌న్ జ‌నాల్లో బ‌లంగా క‌నిపిస్తుంద‌ని స‌ద‌రు ఎన‌లిస్ట్ బ‌లంగానే వాదించాడు.