Begin typing your search above and press return to search.

ఆగష్టు 15 బాక్సాఫీస్.. అందరూ ఎగబడేలా ఉన్నారు!

పెద్ద సినిమాలని రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు లాంగ్ వీకెండ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.

By:  Tupaki Desk   |   11 March 2024 4:29 AM GMT
ఆగష్టు 15 బాక్సాఫీస్.. అందరూ ఎగబడేలా ఉన్నారు!
X

పెద్ద సినిమాలని రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు లాంగ్ వీకెండ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే పర్టిక్యులర్ గా కొన్ని సీజన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకొని వారి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమా తీయడం ఒక ఎత్తైయితే దానిని పబ్లిక్ కి చేరువ చేయడం కూడా పెద్ద టాస్క్. స్టార్ హీరోల సినిమాలకి ఆటోమేటిక్ గా ఫ్యాన్ బేస్ కారణంగా హైప్ వస్తుంది. అయితే ఈసారి ఒక డేట్ కోసం అన్ని ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోల సినిమాలు పోటీకి సిద్ధం కాబోతున్నాయి.

ఆగష్టు 15 డేట్ దర్శక, నిర్మాతలకి ప్రామిసింగ్ డేట్ గా ఉంది. ఈ డేట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సుకుమార్ టీమ్ కూడా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15కి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయితే తప్ప రిలీజ్ డేట్ మరే అవకాశం లేదు.

మరోవైపు కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న భైరాతి రంగల్ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. మఫ్టీ ప్రీక్వెల్ గా ఈ సినిమా నార్తన్ దర్శకత్వంలో సిద్ధం అవుతోంది. దీంతో ఈ మూవీపైన కూడా కన్నడనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మమ్ముట్టి భీష్మపర్వం ఫేమ్ అమల్ నీరద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా ఆగష్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ GOAT కూడా ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న సింగం రిటర్న్స్ మూవీ కూడా ఆగష్టు 15న రిలీజ్ కాబోతోంది. ఇలా అన్ని భాషలలో ఈ డేట్ కి మూవీస్ రాబోతూ ఉండటంతో సిల్వర్ స్క్రీన్ పై పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇందులో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా పుష్ప ది రూల్ సినిమాకి మెజారిటీ థియేటర్స్ లభించే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అలాగే ఎక్కువ మంది పుష్ప ది రూల్ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. అయితే తమిళ్ లో విజయ్ సినిమా వస్తే అక్కడ అతనికి పోటీగా నిలవడం అల్లు అర్జున్ కు పెద్ద చాలెంజ్. కాబట్టి టాక్ ను బట్టి పుష్ప 2కి థియేటర్స్ కు పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా అన్ని వైపులా ఈసారి బన్నీ బలమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంది.