Begin typing your search above and press return to search.

సైఫ్‌ పై దాడి.. ఆటో డ్రైవ‌ర్ చెప్పిన సీక్రెట్స్

''అతడు సైఫ్ అలీ ఖాన్ అని నాకు తెలియదు. అది అత్యవసర పరిస్థితి. నా ఆటోలోకి ఎక్కుతున్న ఈ ప్రయాణీకుడు ఎవరో నాకు కూడా తెలియదు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 4:06 AM GMT
సైఫ్‌ పై దాడి.. ఆటో డ్రైవ‌ర్ చెప్పిన సీక్రెట్స్
X

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నివ‌శిస్తున్న బాంద్రా 'స‌ద్గురు ట‌వ‌ర్‌'లో 12వ అంత‌స్తులోకి జొర‌బ‌డి దొంగ‌త‌నానికి ప్ర‌య‌త్నించిన దుండ‌గుడు, సైఫ్ ప్ర‌తిఘ‌డించ‌డంతో క‌త్తితో ఎటాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో సైఫ్ శ‌రీరంలోకి ఆరు క‌త్తిపోట్లు దిగ‌గా, లీలావ‌తి ఆస్ప‌త్రి వైద్యులు శ‌స్త్ర చికిత్స‌లు నిర్వహించారు. సైఫ్ ప్రాణాల‌తో సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారు.

అదంతా అటుంచితే, సైఫ్ ఖాన్ పై దాడి అనంత‌రం బాంద్రా ఇంటి నుంచి అత‌డు ఆస్ప‌త్రికి చేరేవ‌ర‌కూ న‌డిచిన మెలోడ్రామా గురించి సైఫ్ ని ఆస్ప‌త్రికి చేర్చిన ఆటో డ్రైవ‌ర్ చెప్పిన సంగ‌తులు ఆస‌క్తిని క‌ల‌గిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తెల్ల‌వారుఝాము స‌మ‌యంలో ఒక మహిళ ''రోకో, రోకో, రోకో (ఆపు, ఆపు, ఆపు)'' అని అరుస్తూ రోడ్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చింద‌ని తెలిపాడు. మ‌రింత వివ‌రంగా చెబుతూ-''నేను లింకిన్ రోడ్ లో వెళ్తున్నాను. ఆయన (సైఫ్ అలీ ఖాన్) నివసించే భవనం పేరు సత్గురు నివాస్. ఒక మహిళ రిక్షా, రిక్షా, రిక్షా, రోకో, రోకో, రోకో అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఆమె భవనం గేటు దగ్గర ఆటో ఆపమని అడిగింది'' అని శ్రీ రాణా తెలిపారు. ఆ స‌మ‌యంలో ఆసుపత్రికి తీసుకెళ్తున్న వ్యక్తి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అని ఆటో డ్రైవర్‌కు తెలియదు.

''అతడు సైఫ్ అలీ ఖాన్ అని నాకు తెలియదు. అది అత్యవసర పరిస్థితి. నా ఆటోలోకి ఎక్కుతున్న ఈ ప్రయాణీకుడు ఎవరో నాకు కూడా తెలియదు. నేను ఇబ్బందుల్లో పడతానేమోన‌ని భయపడ్డాను'' అని రాణా అన్నారు. ''అతడు (సైఫ్) రక్తంతో తడిసిన తెల్లటి చొక్కా ధరించాడు. అత‌డితో ఒక పిల్లవాడు, ఒక యువకుడు కూడా ఆటోలో కూర్చున్నారు'' అని ఆటో డ్రైవర్ సంఘటనల క్రమాన్ని వివరించాడు.

హోలీ ఫ్యామిలీ ఆస్ప‌త్రి లేదా లీలావతి ఆసుపత్రికి డ్రైవ్ చేయాలా? అని అడిగినప్పుడు ''అత‌డు (సైఫ్‌) నన్ను లీలావతికి తీసుకెళ్లండి'' అని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఒక గార్డును పిలిచారు. ఆసుపత్రి సిబ్బంది అక్క‌డికి వ‌చ్చారు! అని ఆటో డ్రైవర్ చెప్పాడు.

ఆస్ప‌త్రికి చేరుకున్నాక ఆ ప్రయాణీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు..''నేను సైఫ్ అలీ ఖాన్'' అని చెప్పాడు. అప్ప‌టివ‌ర‌కూ ఆటోడ్రైవర్‌కు అత‌డు బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ అనే విష‌యం తెలీదు. ఆ త‌ర్వాత వ‌రుస సంఘ‌ట‌న‌ల గురించి తెలిసిందే. సైఫ్ కి లీలావ‌తి ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు స‌కాలంలో వైద్యం అందించ‌డంతో అత‌డు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

సైఫ్‌ను ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్ అక్కడే ఉన్నారా? అని ఆటో డ్రైవ‌ర్ ని అడిగినప్పుడు 'నేను గమనించలేదు' అని అత‌డు స‌మాధాన‌మిచ్చాడు. అయితే ఘ‌ట‌న అనంత‌రం రిలీజైన కొన్ని విజువ‌ల్స్ లో ఆటో ప‌క్క‌నే త‌న ఇంటి ప‌నిమ‌నుషుల‌తో మాట్లాడుతున్న క‌రీనా వీడియో క‌పూర్ వీడియో వైర‌ల్ అయింది. అయితే ఘ‌ట‌న‌తో ఈ వీడియోకి సంబంధం లేద‌ని భావించాల్సి ఉంటుంది.