Begin typing your search above and press return to search.

ఆవకాయ ఆంజనేయ.. ఘాటైన మాస్ డోస్

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న హను-మాన్ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:45 PM GMT
ఆవకాయ ఆంజనేయ.. ఘాటైన మాస్ డోస్
X

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న హను-మాన్ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అ! - కల్కి వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ ఫార్మాట్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఇక తేజ సజ్జ నటించిన ఈ సూపర్ హీరో చిత్రం హను-మాన్ కు సంబంధించిన సాంగ్స్ తో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల విడుదలైన ఒక పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు చిత్రంలోని మూడవ సాంగ్ ఆవకాయ ఆంజనేయను విడుదల చేశారు. మాస్ బీట్‌లతో కూడిన ఈ జానపద సంగీతాన్ని అనుదీప్ దేవ్ స్వరపరిచారు. అమృత అయ్యర్‌తో పాటు ఆవకాయ ఊరగాయను సిద్ధం చేస్తున్న స్త్రీలతో పాట ప్రారంభమవుతుంది.

ఇక కొంతమంది ముసుగులు ధరించిన దుండగులు హీరోయిన్ పై దాడి చేయడానికి ప్రయత్నించగా వారిని రక్షించడానికి ఆంజనేయ స్వామి వంటి హనుమంతుడు రంగంలోకి దిగడం హైలెట్ అయ్యింది. ఆవకాయను తయారుచేసే సంప్రదాయం అలాగే యాక్షన్ ఎపిసోడ్ పాటకు మంచి హైప్ తెచ్చాయి. సింహాచలం మన్నెల సాహిత్యం అందించగా, గాలిదేవర సాహితీ పాటను పాడారు.

ఇక హీరో తేజ సజ్జ ఈ పాటలో పవర్ఫుల్ గా కనిపించాడు. ఇక సాంగ్ కు తగ్గట్టుగా యాక్షన్ బ్లాక్‌లు కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయబడ్డాయి. మొదట విడుదల చేసిన హనుమాన్ చాలీసా భక్తి గీతం, అలాగే సూపర్ హీరో హనుమాన్ సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పుడు మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ కూడా బాగా హైప్ క్రియేట్ చేసే విధంగా ఉంది.

ఇక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. సినిమాలో వినయ్ రాయ్ విలన్‌గా కనిపించనుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రానున్న మొదటి సినిమా హను-మాన్. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఇక సినిమాను 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ రేంజ్ విడుదల చేయబోతున్నారు.