Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ఖాన్‌తో బ్రేక‌ప్.. ఇన్నాళ్ల‌కు అవంతిక క్రిప్టిక్ పోస్ట్

అవంతిక 2019 నుండి తాను చూడని ఇద్దరు స్నేహితులను కలుసుకున్నట్లు కూడా గుర్తుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ నుంచి విడిపోయినప్ప‌టి నుండి తాను ఎలా మారిపోయిందో కూడా అవంతిక వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 5:30 PM GMT
ఇమ్రాన్ ఖాన్‌తో బ్రేక‌ప్.. ఇన్నాళ్ల‌కు అవంతిక క్రిప్టిక్ పోస్ట్
X

అమీర్ ఖాన్ మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య అవంతిక మాలిక్ నిజ‌జీవిత ప్రేమ‌క‌థ‌, బ్రేక‌ప్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇమ్రాన్ ప్ర‌స్తుతం న‌టి లేఖా వాషింగ్ల‌న్ తో లివిన్ రిలేష‌న్ లో ఉన్నారు. అయితే కొన్నేళ్ల త‌ర్వాత అవంతిక‌ సోషల్ మీడియాలో ఒక ఘాటైన‌ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసారు. దీనిలో బ్రేక‌ప్ తరువాత త‌న‌ జీవితంలోని కష్ట కాలం గురించి అవంతిక మాట్లాడారు. బాల్యం నుండి కలిసి ఉన్న ఈ జంట 2011 లో వివాహం చేసుకున్నారు. కానీ ఎనిమిది సంవత్సరాల సంసారం తర్వాత 2019లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇది అవంతిక‌ను చాలా బాధించింది.

ఇన్‌స్టా పోస్ట్‌లో క్రిప్టిక్ గా వ్యాఖ్యానించారు. 2019ని ముక్క‌లు ముక్క‌లుగా మారిన కాలమిద‌ని అభివర్ణించింది. విడిపోవడం తీవ్రమైన బాధను మిగిల్చింద‌ని ఈ కొద్ది రోజుల కాలంలో గొప్ప మార్పును త‌న‌లో చూశాన‌ని అవంతిక సుదీర్ఘ లేఖ‌లో రాసారు. జీవితంలోని దుర్బలత్వం గురించి ఒక సందేశాన్ని రాసింది. ప్ర‌తి ఒక్క‌రూ ప్రతి క్షణాన్ని గౌరవించాలని జీవితంలోని దుర్బలత్వాన్ని స్వీకరించాలని తన సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ ని కోరింది.

నిజం ఏమిటంటే - మనం ఇక్కడ గడిపే రోజులు నిజానికి అంత పెద్ద స‌మ‌స్యాత్మ‌క‌మైన‌వి కావు. కాబట్టి రేపు మేల్కొనే అవకాశం మీకు లభిస్తే, ఈ ప్రపంచం మిమ్మల్ని వృద్ధుల‌ను చేయడానికి ప్ర‌య‌త్నించినా తట్టుకుని, ఏదైనా బంగారు క్ష‌ణం మిమ్మల్ని కలవడానికి ఛాన్సుంటే, మీరు దాని కోసం ఎదురు చూస్తారని నేను ఆశిస్తున్నాను.. అని అవంతిక ఆశావ‌హంగా రాసింది. రిస్క్ తీసుకోవాలని, ఘాఢంగా ప్రేమించాలని కూడా అంది. మీ హృదయాన్ని పణంగా పెట్టండి. వీలున్నంత‌గా ప్రేమ‌ను వ్యక్తపరచండి.. అని ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించింది.

అవంతిక 2019 నుండి తాను చూడని ఇద్దరు స్నేహితులను కలుసుకున్నట్లు కూడా గుర్తుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ నుంచి విడిపోయినప్ప‌టి నుండి తాను ఎలా మారిపోయిందో కూడా అవంతిక వెల్ల‌డించింది. నా ఇద్ద‌రు స్నేహితులు ఆశ్చ‌ర్య‌పోయారు. నేను ఇంకా జీవిస్తున్నాన‌ని...తెలిసి. ఇప్పుడు నా ముఖంలో వారు మెరుపును చూసారు అని అవంతిక రాసింది. తన పరివర్తనకు కారణం అత్యంత విపత్కర పరిస్థితులలో కూడా ఆశావాదంపై త‌న‌కున్న దృఢమైన నమ్మకమని పేర్కొంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఆలోచించేలా చేసిందని రాసింది.

బ్రేక‌ప్ అయినా కానీ, అవంతిక - ఇమ్రాన్ తమ కుమార్తె ఇమారాకు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. అవంతికతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా బ్రేక‌ప్ అయ్యాక‌, ఇప్పుడు నటి లేఖా వాషింగ్టన్ తో ప్రేమలో ఉన్నాడు. తాజా పోస్ట్ లో అవంతిక తన వ్యక్తిగత కష్టాల గురించి మాత్రమే కాకుండా.. కష్టాల తర్వాత స్వ‌శ‌క్తి గురించి కూడా హైలైట్ చేసింది.