ఇంగ్లీష్ పిల్ల..తెలుగు పిల్లా అంటున్నారా?
బాల నటిగానే కెరీర్ ప్రారంభించిన అవంతిక వందనపు గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 25 Feb 2024 11:30 PM GMTబాల నటిగానే కెరీర్ ప్రారంభించిన అవంతిక వందనపు గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మోత్సవం.. ప్రేమమ్.. రారండోయ్ వేడుక చూద్దాం.. అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ కే వెళ్లిపోయింది. అక్కడ `స్పిన్`: `మీన్ గర్ల్స్` చిత్రంతో అక్కడ కన్నా ఇక్కడ బాగా వెలు గులోకి వస్తోంది. తెలుగమ్మాయికి హాలీవుడ్ అవకాశం ఎలా? ఈ పిల్లలో అంత సీన్ ఉందా? అంటూ అంతా చర్చించుకోవడంతో మరింత ఫేమస్ అయింది.
`మీన్ గర్స్ల్` కోసం చేసిన హాట్ డాన్స్ తోనే ఇదంతా సాద్యమైంది. సినిమా ప్రమోషన్ల భాగంగా అమ్మడి అమెరికన్ ఇంగ్లీష్ సంగం జనాలు పిదా అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ ఇంగ్లిస్ యాక్సెంట్ చూసి అమెరికా పిల్ల..తెలుగు అమ్మాయా? అన్న సందేహం పడటం సహజం. చూడటానికి తెలుగమ్మాయి అయినా ఇంగ్లీష్ చూసి ఇంగ్లీష్ పిల్ల అనుకునేరు. ఈ అమ్మడు పక్కా తెలంగాణ పిల్ల అట. అవును ఆ సంగతులు అవంతిక రివీల్ చేసింది.
అమెరికా స్కూల్ కి వెళ్లినంత మాత్రాన తెలుగు మర్చిపోయాను అనుకుంటున్నారా? అంటూ గుసా యించింది. `అమ్మ-నాన్నలది తెలంగాణ. హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడి అలవాట్లు..ఆహారం.. సుల్తాన్ బజార్ లో దొరికే గాజులు అంటే ఎంతో ఇష్టం. పక్కా తెలంగాణ మాట్లాడుతాను. తెలుగుతో పాటు హిందీ కూడా అనర్గళంగా మాట్టాడుతా. అమెరికా స్కూల్ కి వెళ్లినా మన కల్చర్ బట్టలే తొడుక్కుని వెళ్లే దాన్ని. అక్కడ నన్ను చూసి హేళన..అవమానం కూడా ఎదుర్కున్నా.
తర్వాత అన్నీ అలవాటైపోయాయి. అవసరం మేర అక్కడ కల్చర్ పాటించేదాన్ని . కానీ తొలి ప్రాధాన్యత మన సంప్రదాయానికే ఇచ్చేదాన్ని. నుదిటిన రెగ్యులర్ గా బొట్టు పెట్టుకుంటా. కూచిపూడి కథక్ నేర్చు కున్నా. కర్ణాటిక్ సంగీతం తెలుసుకున్నా. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే నటించే ఆలోచన లేదు` అని అంది.