Begin typing your search above and press return to search.

అమ్మ చేసింది మిస్ యాడ్ గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు హాలీవుడ్ లో!

దీంతో అవంతిక సుమారు ఏడేళ్ల క్రితం చేసిన ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్న పాప ఇలా మారిపోయిందా?

By:  Tupaki Desk   |   15 Jan 2024 10:02 AM GMT
అమ్మ చేసింది మిస్ యాడ్ గుర్తుందా? ఆ అమ్మాయే ఇప్పుడు హాలీవుడ్ లో!
X

బుల్లితెరపై కొన్ని యాడ్స్ ఎక్కువగా ప్రజలకు గుర్తుండిపోతాయి. అమ్మను మరిచిపోలేం.. అంబికాను మరిచిపోలేం అనేది తెలుగు వాళ్లకు ఎక్కువగా గుర్తుండే యాడ్ డైలాగ్. అలానే ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్‌లో కనిపించిన చిన్నారి, ఆమె చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అమ్మ చేసింది మిస్.. లైట్‌గానే ఉంటుంది అంటూ క్యూట్ గా చెప్పిన ఆ యాడ్ బాగానే వైరల్ అయింది.

ఆ యాడ్‌లో నటించిన చిన్నారి అవంతిక వందనపు పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మాట్లాడుకునే రేంజ్‌లో సత్తా చాటింది. ఆమె ఇటీవలే యాక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ (మీన్ గర్ల్స్)కు మంచి స్పందన వస్తోంది. ఆమె యాక్టింగ్ కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా అవంతికకు స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

దీంతో అవంతిక సుమారు ఏడేళ్ల క్రితం చేసిన ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్న పాప ఇలా మారిపోయిందా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె కోసం తెగ వెతికేస్తున్నారు.ఇన్ స్టా ఐడీ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఫ్రెండ్స్‌ను గమనిస్తుంటే అంతా కూడా హాలీవుడ్ బ్యాచ్ అన్నట్టుగానే ఉంది. ఆమె న్యూయార్క్‌‌లోనే ఉంటూ హాలీవుడ్‌లో నటిస్తోంది.

శాన్ ఫ్రాన్సిస్కోలోని హైదరాబాదీ తెలుగు కుటుంబంలో పుట్టిన అవంతిక తన బాల్యం అంతా తెలంగాణలోనే గడిచింది. చిన్నప్పటి నుంచి కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందింది. జీ తెలుగు నార్త్ అమెరికాలో రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ స్టార్స్‌లో ద్వితీయ బహుమతిని గెలుచుకుని గుర్తింపు తెచ్చుకుంది.

2016లో మహేశ్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం మూవీలో నటించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అవంతిక. మనమంతా, ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి సినిమాలు కూడా చేసింది. ఫార్చ్యూన్ ఆయిల్ యాడ్ తోపాటు అనేక యాడ్స్ చేసింది. ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు మీన్ గర్ల్స్ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

అవంతికను చూస్తుంటే గర్వంగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మహేశ్ బాబు బ్రహ్మోత్సవం రిలీజ్ టైమ్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతోపాటు పార్చ్యూన్ ఆయిల్ యాడ్ ను షేర్ చేస్తూ గుర్తుచేసుకుంటున్నారు. అవంతిక తన కెరీర్‌లో మరింతగా ఎదగాలని ఆశిస్తున్నారు.