Begin typing your search above and press return to search.

లియో డైరెక్ట‌ర్ గారాల చెల్లెలు హీరోయిన్‌ని కొట్టేలా!

అయితే 'లియో' రిలీజ్ వేళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ సోదరి అవంతిక కనగరాజ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 6:57 PM GMT
లియో డైరెక్ట‌ర్ గారాల చెల్లెలు హీరోయిన్‌ని కొట్టేలా!
X

న‌ట‌న‌లోకి రావాలంటే జీల్ కావాలి. పైగా సెట్లో వంద మంది ముందు గ‌ట్సీగా న‌టించి చూపించాలంటే అదేమీ సులువైన‌ది కాదు. చాలా ప్ర‌య‌త్నం కావాలి. అందుకే చాలామంది స్టార్ కిడ్స్ త‌మ‌కు ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా న‌ట‌న కంటే ముందు తెర‌వెన‌క విష‌యాలు నేర్చుకునేందుకే శ్ర‌ద్ధ పెడ‌తారు. అక్క‌డ సుదీర్ఘ అనుభవం ఘ‌డించి సెట్ లో అన్నిటినీ ప‌రిశీలించాక కొంద‌రు న‌టీన‌టులుగా ట‌ర్న్ అవుతుంటారు.



అయితే 'లియో' రిలీజ్ వేళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ సోదరి అవంతిక కనగరాజ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ భామ ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. నిండా పాతిక అయినా లేని ఈ యంగ్ లేడీ అంద‌చందాలకు ఫిదా కాని వాళ్లు లేరు. ఒక హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని బ్యూటీ ఈ అమ్మ‌డి సొంతం. నిజానికి అవంతిక ఫోటోషూట్ ఇటీవల బయటకు వచ్చి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఆ అందానికి చాలామంది విస్మయానికి గుర‌య్యారు. త‌న క‌థేంటో తెలుసుకోవాల‌ని ఉవ్విళ్లూరారు.

అయితే అవంతిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక సినీపరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రారంభంలో రెండు సంవత్సరాలకు పైగా స్టూడెంట్ మార్కెట‌ర్ గా పనిచేసింది. అనంతరం టాలెంట్ మేనేజర్ - క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కొత్త పాత్రల్లోకి మారింది.

ప్ర‌స్తుతానికి తెర‌వెన‌క ప‌ని చేయ‌డ‌మే త‌న‌కు ఇష్టం. అందం ఛ‌రిష్మా ఉన్నా అవంతికకు నటనా వృత్తిపై ఎలాంటి ఆస‌క్తి లేదు. అయితే మునుముందు త‌న సోద‌రుడు న‌టించ‌మ‌ని అడిగితే అరుదుగా అయినా తెర‌పై క‌నిపిస్తుందా? అన్న‌ది చూడాలి. ప్రస్తుతం యువ‌త‌రం వాట్సాపుల్లో అవంతిక ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి.