Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ దెబ్బ‌కి తెలుగు పిల్ల అల్లాడిపోయింది!

అది నాకు స‌హ‌జంగా వ‌చ్చింది. అన్ని ప్రాంతాల్లో నేను తెలుగు మాట్లాడ‌లేను. తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో విజ‌యం సాధిస్తే ఆద‌రించాలి.

By:  Tupaki Desk   |   16 March 2024 1:38 PM GMT
ట్రోలింగ్ దెబ్బ‌కి తెలుగు పిల్ల అల్లాడిపోయింది!
X

తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు ఇప్పుడు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరుగా మారింది. తెలుగులో న‌టించింది కొన్ని సినిమాలే అయినా హాలీవుడ్ సినిమాలు చేయ‌డంతోనే ఈ ర‌క‌మైన గుర్తింపు ద‌క్కింది. 'స్పిన్' ..'మీన్ గర్ల్స్' లాంటి చిత్రాల‌తోనే ఇది సాధ్య‌మైంది. అంత‌కు మించి అమ్మ‌డు అమెరిక‌న్ ఇంగ్లిష్ యాక్సెంట్ తో మ‌రింత పాపుల‌ర్ అయింది. అయితే ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఆమెకి నెగిటివ్ గాను మారాయి.

సోష‌ల్ మీడియాలో ఆమె ఇంగ్లీష్ ట్రోలింగ్ కి దారి తీసింది. అందులోనూ ఆ ట్రోలింగ్ ఇండియా నుంచి ఉండ‌టం ఆస‌క్తిక‌రం. దీంతో ఆమె ట్రోలింగ్ పై మొద‌టిసారి స్పందించింది. 'అమెరికాలో పుట్టి పెరిగిన నేను స్కూల్లో అమెరిక‌న్ ఇంగ్లీష్‌- ఇంట్లో ఇండియ‌న్ ఇంగ్లీష్ మాట్లాడుతాను. దీన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. ఇది తెలియ‌క చాలా మంది ట్రోల్ చేసారు. ఇలా ఎందుకు మాట్లాడుతుంద‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు పెట్టారు.

అది నాకు స‌హ‌జంగా వ‌చ్చింది. అన్ని ప్రాంతాల్లో నేను తెలుగు మాట్లాడ‌లేను. తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో విజ‌యం సాధిస్తే ఆద‌రించాలి. అంతేకాని అన‌వ‌స‌రంగా ట్రోలింగ్ చేయ‌కూడ‌దు. ఇలాంటి ట్రోలింగ్ ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా చూడ‌లేదు. ఎంతో మంది న‌న్ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నార‌ని భావిస్తున్నా. నా గురించి నా ఫ్యామిలీ ఏమ‌నుకుంటుంది అన్న‌దే ముఖం. మిగ‌తా ఏ విష‌యాలు ప‌ట్టించుకోను ' అని అంది.

అవంతిక బాల న‌టిగానే కెరీర్ ప్రారంభించింది. 'బ్రహ్మోత్సవం'.. 'ప్రేమమ్'.. 'రారండోయ్ వేడుక చూద్దాం'..' అజ్ఞాతవాసి' లాంటి చిత్రాల్లో న‌టించింది. అయితే అమ్మ‌డు తెలుగు సినిమాల‌కంటే ఇంగ్లీష్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తుందని ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది. కానీ ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంది. తెలుగు సినిమాలే టార్గెట్ గా ప‌నిచేయాలంటోంది. తెలుగు..హిందీ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించాల‌నే ఆస‌క్తిని వ్యక్తం చేసింది. అలాగే అమెరికాలో నెపోటిజం లేద‌ని.. ప్ర‌తిభ‌ని బ‌ట్టి అక్క‌డ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని తెలిపింది.