Begin typing your search above and press return to search.

అవ‌తార్ 3: గుండె ప‌ట్టుకుని సీట్ ఎడ్జ్ పైకి జార‌తారు

రెండో భాగంపై కొన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:30 PM GMT
అవ‌తార్ 3: గుండె ప‌ట్టుకుని సీట్ ఎడ్జ్ పైకి జార‌తారు
X

`టైటానిక్` స‌హా ఎన్నో సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించిన జేమ్స్ కామెరూన్ 'అవ‌తార్`'ఫ్రాంఛైజీ సృష్టిక‌ర్త‌గా బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద‌ మిరాకిల్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవ‌తార్ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే అవ‌తార్, అవ‌తార్ 2 విడుద‌లై సంచ‌ల‌న వసూళ్ల‌ను సాధించాయి. రెండో భాగంపై కొన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు కామెరూన్ నుంచి అవ‌తార్ 3 గురించి కొత్త అప్ డేట్ అందింది. 'అవతార్ 3: ఫైర్స్ అండ్ యాష్' 19 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదల కానుంది.

జేమ్స్ కామెరూన్ తాజాగా 'అవతార్ 3: ఫైర్స్ అండ్ యాష్' ఫ్రాంఛైజీలోనే సుదీర్ఘ నిడివితో వ‌స్తోంద‌ని చెప్పారు. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల‌న్నిటిలోను అత్యంత సాహసోపేతంగా తెర‌కెక్కించిన‌ సినిమా ఇదే కావచ్చని కామెరూన్ వెల్ల‌డించారు. యుకే ఎంపైర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అభిమానులు తాజా చిత్రం నుండి ఏమి ఆశించవచ్చో చర్చించారు. మొదటి రెండు చిత్రాల విజయాలను పునరావృతం చేయడానికి బదులుగా ప్రేక్షకులు కొత్త‌ద‌నం నిండిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ని వీక్షించేందుకు గుండె ధైర్యం చూపాల్సి ఉంటుంద‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా కామెరూన్ పార్ట్ 3పై అంచ‌నాల‌ను పెంచేసారు.

ప్ర‌తిసారీ రొటీనిటీని బ్రేక్ చేయాలి. వైవిధ్యంగా ధైర్య‌మైన ఎంపిక‌ల‌తో ముందుకు సాగాల‌ని కామెరూన్ వ్యాఖ్యానించారు. పార్ట్ 3లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఊహ‌కు మించి ఉంటాయి. ఉత్కంఠభరితమైన సీట్ ఎడ్జ్ మూవ్ మెంట్స్ ని చూస్తార‌ని కామెరూన్ హామీ ఇచ్చాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆశ్చర్యం క‌లిగించ‌డ‌మే కాదు, అర్థవంతమైనవిగా ఉంటాయ‌ని ప్రేక్ష‌కుల‌కు హామీ ఇచ్చాడు. అవతార్ సినిమాలో మీరు ఇంతకు ముందు చూడని పాత్రల‌ను చూపిస్తున్నామ‌ని తెలిపారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' చిత్రీక‌ర‌ణ‌తో పోలిస్తే 'అవతార్ 3'ని వేగంగా పూర్తి చేస్తున్నామ‌ని కామెరూన్ వెల్లడించారు.