Begin typing your search above and press return to search.

సాంప్రదాయానికి గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన అవికా

చీరలో ఆకట్టుకునే అందం మాత్రమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తరచుగా తన స్టైలిష్ ఫోటోషూట్‌లతో యూత్‌ను మరింత ఆకర్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:30 PM GMT
సాంప్రదాయానికి గ్లామర్‌ టచ్‌ ఇచ్చిన అవికా
X

అవికా గోర్.. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల మదిని గెలుచుకుని, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల తార. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చీరల ఫోటోషూట్‌తో ఆమె మరొకసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. పసుపు ఊదా రంగు కలగలిపిన చీరలో ఉన్న అవికా గ్లామర్‌తో పాటు, ఆమె వ్యక్తిత్వానికి ఒక కొత్త సొగసును చేర్చింది. ఈ ఫోటోలలో ఆమె ధరించిన చీర సంప్రదాయపు అందాన్ని హైలైట్ చేస్తూ, స్టైలిష్ జ్యువెలరీతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

గోల్డ్ బ్యాంగిల్స్, క్లాసిక్ ఈయర్ రింగ్స్ మరియు అందమైన ఉంగరంతో తన లుక్‌ను సంప్రదాయంలోనూ స్టైలిష్‌గా హైలెట్ అయ్యింది. "చీరలో ప్రతీ మహిళ ప్రకాశిస్తుంది" అనే క్యాప్షన్‌తో అవికా ఫోటోలు షేర్ చేయగా, నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అందం, అభినయంతో పాటు ఆమె చూపించిన ఈ సాంప్రదాయ దృక్పథం పట్ల సోషల్ మీడియాలో అభిమానులు మెచ్చుకుంటున్నారు.

అవికా తన సినీ ప్రయాణాన్ని తెలుగులో 'ఉయ్యాల జంపాల'తో ప్రారంభించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆమె 'రాజ్ తరుణ్' సరసన 'సినిమా చూపిస్త మావ' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా అవకాశాలను అందుకున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో అవికా మరోసారి టాలీవుడ్‌లో తన సత్తా చాటారు.

తెలుగులో కొంత గ్యాప్ తర్వాత 'రాజుగారి గది 2'లో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్న ఆమె, బాలీవుడ్‌లో కూడా తన స్థానాన్ని స్థిరపరచుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల 'బ్లడీ ఇష్క్' అనే హిందీ సినిమాలో నటించినా, ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేదు. అయినప్పటికీ, అవికా తన ఫ్యాషన్, గ్లామర్‌తో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

చీరలో ఆకట్టుకునే అందం మాత్రమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తరచుగా తన స్టైలిష్ ఫోటోషూట్‌లతో యూత్‌ను మరింత ఆకర్షిస్తున్నారు. ఈ తాజా ఫోటోషూట్ కూడా అదే కోవలో ఉందని చెప్పవచ్చు. ఆమె ప్రతి ఫోటోలో కనిపించే కాన్ఫిడెన్స్ ఆమె కెరీర్‌ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అనిపిస్తోంది. అవికా గోర్ తన గ్లామర్ మరియు అభినయంతో మాత్రమే కాకుండా, సంప్రదాయాన్ని ప్రదర్శించే తన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త ఆహ్లాదాన్ని అందిస్తోందని ఈ ఫోటోలు మరోసారి రుజువుచేశాయి.