Begin typing your search above and press return to search.

బ్లాక్‌ చీరలో మతి పోగొట్టే అందం

ఉయ్యాల జంపాల సినిమాతో వచ్చిన సక్సెస్‌ను సద్వినియోగం చేసుకుని పలు ఆఫర్లు సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 5:17 AM GMT
బ్లాక్‌ చీరలో మతి పోగొట్టే అందం
X

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో బాల నటిగా పరిచయం అయిన అవికా గోర్‌ తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హిందీ సీరియల్స్ ద్వారా హిందీలోనే కాకుండా అన్ని చోట్ల మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న అవికా గోర్‌కి హీరోయిన్‌గా తెలుగులో మొదటి అవకాశం దక్కింది. 'ఉయ్యాల జంపాల' సినిమాతో అవికా హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు సొంతం చేసుకోవడంతో పాటు, కమర్షియల్‌గా ఆ సినిమా హిట్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్‌గా మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.


ఉయ్యాల జంపాల సినిమాతో వచ్చిన సక్సెస్‌ను సద్వినియోగం చేసుకుని పలు ఆఫర్లు సొంతం చేసుకుంది. సినిమా చూపిస్తా మావతో మరో విజయాన్ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది. అయితే ఈమె కొన్ని అనవసర ఎంపికల కారణంగా కెరీర్‌లో ఫ్లాప్స్‌ పడ్డాయి. దాంతో ఆఫర్లు కాస్త తగ్గాయి. ఆ మధ్య కాస్త బరువు ఎక్కువ అయింది అంటూ విమర్శలు రావడంతో దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తీసుకుని నేచురల్‌గా సన్నబడి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ ఎంట్రీతో టాలీవుడ్‌లో కుమ్మేస్తాను అనుకున్న అవికా గోర్‌కి నిరాశే మిగిలింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం తన జోరు కంటిన్యూ చేస్తోంది.


రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలతో ముద్దుగుమ్మ అవికా గోర్‌ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా బ్లాక్‌ చీర కట్టులో మతి పోగొడుతోంది. సాధారణంగా హీరోయిన్స్‌ స్కిన్ షో చేస్తేనే ఫోటోలు వైరల్‌ అవుతాయి. చీర కట్టులో క్లీ వేజ్ షో చేస్తూ, నడుము నాభి అందాలను చూపిస్తేనే నెటిజన్స్ లైక్‌ చేస్తారు. కానీ అవేవి లేకుండా బ్లాక్ చీర కట్టులో నిండుగా కనిపించినా అవికా గౌర్‌ కి మంచి స్పందన దక్కింది. ఈ ఫోటోల్లో అవికా చాలా బాగుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ఇంతటి అందమా అంటూ నోరు వెళ్లబెడుతున్న వారు కొంతమంది ఉన్నారు.

మొత్తంగా బ్లాక్ చీర కట్టులో అవికా గోర్‌ మతి పోగొట్టేస్తోంది అంటూ తెగ లైక్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అవికా ఈ ఫోటోలతో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య ఈమె స్కిన్‌ షో చేస్తూ, హొయలు పోతూ షేర్ చేసిన ఫోటోలతో పోల్చితే ఈ బ్లాక్‌ చీర కట్టు ఫోటోలు మరింత అందంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ స్థాయి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు. మరో పదేళ్లు ఈ అమ్మడు సినిమాలు చేయగల సత్తా ఉంది. కానీ ఆఫర్లు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.