Begin typing your search above and press return to search.

పీఎంతో విందు.. ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్..!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:36 PM GMT
పీఎంతో విందు.. ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్..!
X

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్ గానే బుల్లితెర మీద తన సత్తా చాటిన ఈ అమ్మడు ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. తెలుగులో ఉయ్యాల జంపాలతోనే అమ్మడు వెండితెర తొలి ప్రయత్నం చేయగా ఆ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తుంది. ఐతే ఈమధ్య సినిమాల కన్నా వెబ్ సీరీస్ లతో హడావిడి చేస్తుంది అవికా గోర్.

అంతకుముందు ఉన్న తన లుక్ పూర్తిగా మార్చి స్లిమ్ లుక్ తో అదరగొట్టేస్తున్న అమ్మడు తెలుగు వెబ్ సీరీస్ లతో వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఐతే రీసెంట్ గా ఒక విషయంపై తన సంతోషాన్ని వెల్లడించింది అమ్మడు. రీసెంట్ గా ప్రధాని మోడీ నివాసంలో జరిగిన విందులో అవికా గోర్ పాల్గొన్నది. వియత్నాం ప్రధాని ఫామ్‌ మిన్‌ చిన్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా మోడీతో పాటుగా ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రతినిధిగా అవికా గోర్ హాజరై అతిథులను గౌరవించారు.

ఆగష్టు ఫస్ట్ వీక్ లో జరిగిన ఈ ఈవెంట్ గురించి లేటెస్ట్ గా అవికా గోర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. పీఎం ఏర్పాటు చేసిన విందులో తను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని.. ముందు ఈ కార్యక్రమానికి రావాలని ఫోన్ వస్తే అది ఫేక్ కాల్ అనుకున్న అవికా గోర్ ఆ తర్వాత వచ్చిన మెయిల్ చూసి షాక్ తిన్నదట. ఇలాంటి ఛాన్స్ చాల తక్కువమందికి వస్తుంది. ఐతే ముందు ఈ ప్రోగ్రాం ని స్కిప్ చేయాలని అనిపించినా నాన్న చెప్పిన ధైర్యంతో ఆ కార్యక్రమానికి వెళ్లానని అన్నారు అవికా గోర్.

నటిగా సరైన దారిలో ఉన్నానని అప్పుడు తనకు అర్ధమైందని.. ఐతే ఈ అవకాసం తనకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందని.. ఎన్నో ప్రాజెక్ట్ లు చేసేలా చేస్తుందని అన్నారు. పీఎం నుంచి ఈ గొప్ప అవకాశం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని అవికా గోర్ తన ఎగ్జైట్మెంట్ ని వెల్లడించింది. ఐతే కెరీర్ ఎలా ఉన్నా కూడా అవికా గోర్ తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ ని వాడుకుంటూ క్రేజ్ తెచ్చుకుంటుంది.