రొమాంటిక్ సీన్స్‌పై చిన్నారి పెళ్లి కూతురు కామెంట్స్..!
ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది
By: Tupaki Desk | 15 Jun 2024 12:30 PMచిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా చాలా కాలం క్రితమే బాల నటిగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అవికా గోర్. ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
ఈ అమ్మడు నటించిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలు చేయలేక పోయింది. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకుని న్యూ లుక్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ లోనూ ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.
అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను సాగిస్తున్న ఈ అమ్మడికి తాజాగా 1920 అనే హర్రర్ కాన్సెప్ట్ మూవీ ఆఫర్ దక్కింది. ఆ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు చేయాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాల చిత్రీకరణ అనుభవం గురించి అవికా గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అవికా గోర్ మాట్లాడుతూ... చాలా మంది శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటాయని భావిస్తారు. కానీ ఆ సన్నివేశాల చిత్రీకరణ చాలా బోరింగ్ గా ఉంటాయి. అసలు ఆ సన్నివేశాలు చేసే సమయంలో ఏమాత్రం ఉత్సాహం ఉండదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
అలాంటి సన్నివేశాలు చేసే సమయంలో ఏది అవసరమో అదే చేస్తూ ఉంటాం. ఆ సమయంలో షూటింగ్ అనే ఫీలింగ్ తప్ప మరోటి ఉండదు అన్నట్లుగా అవికా చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సన్నివేశాలను బోరింగ్ అంటూ చెప్పేసిన అవికా వ్యాఖ్యలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయట.