Begin typing your search above and press return to search.

సెక్యూరిటీ గార్డ్ అస‌భ్యంగా తాకాడు: అవికా గోర్

మంచి చెడు ఏమిటో తెలియ‌ని వయ‌సులో తాను ఎదుర్కొన్న చెడు గురించి వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:16 AM GMT
సెక్యూరిటీ గార్డ్ అస‌భ్యంగా తాకాడు: అవికా గోర్
X

బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభించింది అవికాగోర్. టీవీ సీరియ‌ళ్ల నుంచి వెండితెర క‌థానాయిక‌గా ఎదిగింది. హిందీ చిత్ర‌సీమ‌తో పాటు, తెలుగులోను న‌టిగా వెలుగొందుతోంది. అయితే త‌న‌కు బాల‌న‌టిగా ఎదురైన కొన్ని అనుభ‌వాల‌ను అవికా తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకుంది. మంచి చెడు ఏమిటో తెలియ‌ని వయ‌సులో తాను ఎదుర్కొన్న చెడు గురించి వెల్ల‌డించింది.

ఇటీవల హౌటర్‌ఫ్లై ఇంటర్వ్యూలో అవికా తనను అంగరక్షకుడు (సెక్యూరిటీ వ్య‌క్తి) లైంగికంగా వేధించాడని వెల్ల‌డించింది. కజకిస్థాన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో వేదికపైకి వెళ్తున్న సమయంలో బాడీగార్డు తనను అనుచితంగా తాకడంతో షాక్‌కు గురయ్యానని అవికా వివరించింది. ఎవరో తనను వెనుక నుండి తాకిన అనుభూతి నాకు గుర్తుకు వచ్చింది. ఒక‌సారి కాదు రెండు సార్లు గార్డ్ త‌న‌ను వెన‌క నుంచి తాకాడని చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై అవిక వివ‌రాలు ఇలా ఉన్నాయి.

``క‌జ‌కిస్తాన్ ఈవెంట్లో ఎవరో నన్ను వెనుక నుండి తాకినట్లు నాకు గుర్తుంది. వెనక్కి తిరిగేసరికి సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నాడు. నేను వేదికపైకి వెళుతున్నప్పుడు.. ఎవరో నన్ను వెనుక నుండి తాకడానికి ప్రయత్నించారు. వెనక్కు తిరిగిన వెంటనే సెక్యూరిటీ గార్డును మాత్రమే చూశాను.. మరెవరినీ చూడలేదని గుర్తుకు వచ్చింది. ఇది రెండవసారి జరగబోయింది. కానీ నేను దానిని ఆపేసాను`` అని అవిక చెప్పింది. అత‌డి చేయి న‌న్ను తాకుతుండ‌గా దానిని ప‌ట్టుకుని ఆపేసాన‌ని అవికా తెలిపింది.

ఇది సిగ్గుచేటు… నేను అతడి వైపు చూసి ఏమిటి? అన‌డిగాను. అతడు క్షమాపణలు చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత నేను ఏం చేయాలి? నేను అప్ప‌టికి వదిలిపెట్టాను. అతడు చేసిన ఆ ప‌ని ఎదుటి వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అత‌డికి తెలియదు. ఆ సమయంలో తాను ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో అవికాకు తెలుసు. ``నాకు అప్పుడు ధైర్యం ఉంటే తిరిగి ఒక‌టిచ్చేదానిని. నేను ఈపాటికి చాలా మందిని కొట్టేదానిని. ఇప్పుడు నేను దీన్ని చేయగలనని అనుకుంటున్నాను.. కానీ అది రిపీట్ కాద‌ని నేను ఆశిస్తున్నాను`` అని తెలిపింది.

బాలికా వ‌ధు 2008లో ప్రసారమైంది. ఈ సీరియ‌ల్ తో అవికా పేరు మార్మోగింది. బాలనటిగా మొదలైన అవికా హిందీ టెలివిజన్ పరిశ్రమలో బాగా పాపుల‌రైంది. కేవ‌లం ఏడు సంవత్సరాల వయస్సులో అవికా నటించడం ప్రారంభించింది. అప్పటి నుండి త‌న‌ నటన స్టైలిష్ లుక్స్ కి అభిమానులేర్ప‌డ్డారు. ఉయ్యాల జంపాల సినిమాతో అవిక‌ తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టాలీవుడ్ లోను త‌న‌కు కొన్ని అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని అవిక వెల్ల‌డించిన సంగ‌తి విధిత‌మే.